క్రికెట్ బంతి కోసం వెళ్లి..

27 Mar, 2016 16:31 IST|Sakshi

బనగానపల్లి(కర్నూలు): క్రికెట్ బంతి కోసం వెళ్లిన చిన్నారి కుళాయి గుంటలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు కుటుంబ సభ్యులు ఈ రోజు ఈస్టర్ కావడంతో చర్చికి వెళ్లి వచ్చారు.

అనంతరం ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో అతని నాలుగేళ్ల కుమారుడు ప్రశాంత్ ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బంతి కుళాయి గుంతలో పడటంతో.. దాని కోసం వెళ్లిన చిన్నారి గుంతలో పడిపోయాడు. గుంతలో నీళ్లు ఉండటంతో అందులో మునిగి మృతిచెందాడు. విగతజీవిగా మారిన చిన్నారిని గుర్తించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరిన్ని వార్తలు