కస్టమ్‌ మిల్లింగ్‌ లక్ష్యం 15 శాతం పెంపు

30 Jan, 2017 01:39 IST|Sakshi
ఆకివీడు : కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎమ్మార్‌) లక్ష్యం మరో 15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం స్థానిక రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ హాలులో జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో కస్టమ్స్‌ మిల్లింగ్‌ రైస్‌ సేకరణ లక్ష్యాన్ని 15 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు వారు తెలిపారు. ఖరీఫ్‌ దిగుబడి 13.50లక్షల మెట్రిక్‌ టన్నులు ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనాలు వేసి జిల్లా యంత్రాంగానికి నివేదించారు. అయితే జిల్లాలో 10.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి మాత్రమే వచ్చింది. ఈ ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లర్లు సేకరించి కస్టమ్‌ మిల్లింగ్‌ చేసి బియాన్ని ప్రభుత్వానికి సరఫరా చేయాలి. ఆ విధంగా జిల్లా ధాన్యం దిగుబడిలో 9.50 లక్షలు మెట్రిక్‌ టన్నులకు మాత్రమే ఖరీఫ్‌లో బియ్యం సేకరించేందుకు మిల్లర్లకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ ప్రకారంగా రైతుల వద్ద నుంచి 69 శాతం సీఎమ్మార్‌ సేకరించాలని నిర్ణయించారు. అయితే జిల్లాలో ధాన్యం నిల్వలు ఉన్నందున మరో 15 శాతం బియ్యం సేకరించాలని లక్ష్యాన్ని నిరే్ధశించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని రైస్‌ మిల్లుల వద్ద నుంచి అదనంగా 15 శాతం బియ్యం సీఎమ్మార్‌గా సేకరిస్తారని జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమావేశంలో చెప్పినట్టు స్థానిక మిల్లర్లు తెలిపారు.
 
మరిన్ని వార్తలు