రామాయపట్నం పోర్టు నిర్మించాలి

29 Sep, 2016 01:26 IST|Sakshi
రామాయపట్నం పోర్టు నిర్మించాలి
 
  • కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కోరిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
కావలి: 
రామాయపట్నంలో పోర్టు, షిప్‌యార్డు నిర్మించాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడును కోరారు. బుధవారం వెంకయ్యనాయుడు కార్యాలయంలో కలిసి కావలి నియోజకవర్గం అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యే చర్చించే సమయంలో మొన్నటి వరకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఉండి ప్రస్తుతం వెంకయ్యనాయుడు పీఎస్‌గా విధులు నిర్వహిస్తున్న జానకి అక్కడే ఉండి ఎమ్మెల్యే  చెబుతున్న విషయాలకు మద్దతుగా మంత్రికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం పథకమైన అమృత్‌కు సంబంధించి కావలి మున్సిపాల్టీకి నిధులు మంజూరు, అవి సద్వినియోగం పట్టణ ప్రజలకు మేలైన సౌకర్యాలు కల్పించే విషయమై ఎమ్మెల్యే మంత్రితో చర్చించారు. పోర్టు నిర్మిస్తే కావలి తోపాటు నెల్లూరు,ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, దగదర్తి వద్ద వున్న కిసాన్‌ సెజ్‌లో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సెజ్‌లో స్థానికులకు కాకుండా ఇతర రాష్ట్రాల ఉపాధి కల్పిస్తుండటంతో స్థానికులు అసంతృప్తిగా ఉన్నారని వివరించారు. జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు, కావలి మున్సిపాల్టీలో నిధులు దుర్వినియోగంపై విచారణ జరపాలని  కోరారు. ఈ విషయాలపై పీఎస్‌ జానకి ని పరిశీలించాలని మంత్రి ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మరిన్ని వార్తలు