సైన్స్‌ ద్వారానే దేశాభివద్ధి సాధ్యం

19 Sep, 2016 10:17 IST|Sakshi
సైన్స్‌ ద్వారానే దేశాభివద్ధి సాధ్యం

నల్లగొండ టూటౌన్‌ : దేశం అభివృద్ధి   సైన్స్‌ ద్వారానే సాధ్యమవుతుందని నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి అన్నారు. ఆదివారం జూనియర్‌ కళాశాల బాలికల వసతి గృహంలో జేవీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మానవ ప్రగతి సైన్స్‌ పాత్ర అంశంపై సెమినార్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

దేశం కోసం సైన్స్, స్వావలంభన కోసం సైన్స్‌ అనే లక్ష్యంతో ప్రజలకు సైన్స్‌ పట్ల అవగాహన కల్పించి మూఢనమ్మకాలను పారదోలాలన్నారు. అందరికి విద్య, అందరి బాధ్యత అనే నినాదంతో సాక్షరత ఉద్యమంలో జేవీవీ కీలకపాత్ర పోషించాలన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన పెంపొందించాలంటే సైన్స్‌ శాస్త్రీయంగా బోదించాలన్నారు. జేవీవీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు, విద్యార్థులు, మేధావులు ప్రొత్సహించి సైన్స్‌ పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు.

ప్రొఫెసర్‌ కృష్ణమరాజునాయుడు మాట్లాడుతూ సైన్స్‌ను శాస్త్రీయంగా బోధించి విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.రమేశ్, జిల్లా అధ్యక్షుడు నన్నూరి వెంకటరమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్‌.రత్నాకుమార్, నాగమణి, అజీజ్, రమ్యప్రభ, వెంకటనర్సమ్మ, సత్యనారాయణ,ప్రొఫెసర్‌ ఆదినారాయణ, ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్, ప్రిన్సిపాల్‌ ప్రవీణమ్మ, నర్సింహారావు  తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు