నొక్కేయ్... మెక్కేయ్!

22 Jul, 2016 05:46 IST|Sakshi
నొక్కేయ్... మెక్కేయ్!

ప్రకటన బోర్డుల టెండర్లలో అవినీతి
బస్టాపులను అప్పనంగా అప్పగించారు..
కార్పొరేషన్‌కు ఏటా రూ.లక్షలు గండి
ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగితేనే అక్రమాలు తేలేది?

సాక్షి ప్రతినిధి,  నిజామాబాద్ :  నిజామాబాద్ నగరపాలక సంస్థలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అధికార ముసుగులో దోపిడీ కొనసాగుతోంది. నగరంలోని రహదారి డివైడర్లపై బోర్డులు, బస్టాపులపై ప్రకటనలకు ఎటువంటి టెండర్లు నిర్వహించకుండానే అయినవారికి అప్పనంగా అప్పగించేశారు. ఎనిమిదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. నగరపాలక సంస్థలో కొన్ని విభాగాలు చూపుతున్న చేతివాటం పాలకవర్గానికి చేటు తెస్తున్నది. ప్రకటనల బోర్డుల ఏర్పాటు టెండర్లు, గత ఎనిమిదేళ్లలో వచ్చిన ఆదాయం, పక్కదారి పట్టిన నిధులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

ప్రకటన బోర్డుల  కాంట్రాక్టులో అవినీతి
నిజామాబాద్ నగర పాలక సంస్థ రహదారులు చుట్టూ 20 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్నారుు.  ఇందులో 10 కిలోమీటర్ల మేర రహదారులకు మధ్యభాగంలో డివైడర్లపై ప్రకటన బోర్డులకు ఏటా టెండర్లు నిర్వహిస్తారు. కానీ.. గత ఎనిమిదేళ్లుగా ఒకే సంస్థకు కాంట్రాక్టు అప్పగించడం.. అలాగే టెండర్ల ద్వారా ఏటా సగటున రూ.2 లక్షల ఆదాయం రాకపోవడం అధికారుల అక్రమాలకు అద్దం పడుతోంది. ఎనిమిదేళ్లుగా ఒక సంస్థ ఏటా కాంట్రాక్టును రూ.2 లక్షలకు లోపు దక్కించుకుంటోంది. ఈ నిర్వాకంలో కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల మితిమీరిన ప్రమేయం కూడా ఉండటంతో ఏటా రూ. 10 లక్షల వరకు వచ్చే ఆదాయం రూ.2 లక్షలకే పరిమితం అవుతున్నది.

ఎనిమిదేళ్లుగా డివైడర్ల బోర్డు ప్రకటనల ద్వారా రూ.10.14 లక్షలు మాత్ర మే వచ్చిందంటే అధికారుల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ చ్చు. ఏటా సగటున రూ.10 వేలు పెంచుకుంటూ కాంట్రాక్టును ఒక సం స్థకు అప్పగిస్తూ భారీగా ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉ న్నారుు. అరుునా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. గతంలో పనిచేసిన ఇద్దరు కమిషనర్లు కూడా చూసీచూడనట్లు విడిచిపెట్టడం.. అ లాగే కాంట్రాక్టుల విషయంలో కొందరు కార్పొరేటర్ల మితిమీరిన జోక్యం కూడా నగరపాలక సంస్థ అవినీతికి కేంద్ర బిందువుగా మారడానికి కారణమవుతున్నది.

అప్పనంగా అప్పగించేశారు..
జిల్లా కేంద్రంలో నగర పాలక సంస్థ ఆధీనంలో ప్రస్తుతం 12 బస్టాపులు ఉన్నాయి. గతంలో ఒక దాత వీటిలో కొన్నింటిని నిర్మించాడని ఉదారంగా ప్రకటనల కోసం అతనికి బస్టాపులను అప్పగించారు. బస్టాపులను నిర్మి స్తే ఆయన పేరు పెట్టుకొని స్మరించాలి లేదంటే నలుగురిలో సన్మానం చే యాలి కానీ.. లక్షల ఆదాయూన్ని తెచ్చిపెట్టే బస్టాపులపై ప్రకటన బోర్డులకు కాంట్రాక్టు కోసం టెండర్లు నిర్వహించకుండా కొన్నేళ్లుగా ఒకే వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తున్నారు. కొన్నేళ్లుగా నిబంధనలు తుంగలో తొక్కి టెండర్లు నిర్వహించకుండా అందినకాడికి దండుకోవడం అధికారులకు రివాజు గా.. దాతకు ఆదాయవనరుగా మారింది. ఇప్పటికైనా ఇంటెలిజెన్స్ అధికారులు స్పందించి లోతుగా విచారణ జరిపితే అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా బయటపడే అవకాశం కలదు.

మరిన్ని వార్తలు