కల్వర్టులతో కలవరం

17 Jul, 2016 19:24 IST|Sakshi
కల్వర్టులతో కలవరం
శిథిలమైన బీటీరోడ్లు, కల్వర్టులు
ప్రమాదమని తెలిసినా తప్పని ప్రయాణాలు
మరమ్మతులపై అధికారుల ఉదాశీనత
 
సీతానగరం: కల్వర్టులు, రోడ్లు శిథిలమైపోయాయి. ప్రమాదాలు పొంచి ఉన్నాయి. రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. మండలంలో నిరంతరం ప్రజలు తిరుగాడే బీటీ రోడ్లు, కల్వర్టులు, రోడ్ల నిర్వహణను గాలికొదిలేయడంతో శిథిలావస్థకు చేరాయి. అంటిపేట వద్ద కల్వర్టు మే నెలలో శిథిలం కావడంతో ఎప్పుడెలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. మండలానికి ఎగువనున్న గ్రామాల్లో వర్షాలు కురిస్తే వచ్చే వరద నీరు, వీఆర్‌ఎస్‌ కాలువ అదనపు నీరు అంటిపేట కల్వర్డునుంచే ప్రవహించాల్సి ఉంది. అయినా కల్వర్టు కూలడంతో నీరు నిరంతరం రోడ్డుపై పారడం వల్ల ప్రమాదం పొంచి ఉందని రైతులు అంటున్నారు. బూర్జ అఖరం చెరువు నిండిన అనంతరం శివాలయం మీదుగా సువర్ణముఖి నదిలోకి మళ్లించాల్సి ఉంది. కల్వర్డు ఏడాది క్రితం శిథిలం కావడంతో రాత్రిపూట వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కేఎస్‌ పురం–పూను బుచ్చింపేట గ్రామాల మధ్య కల్వర్టులు రెండూ ఒకే పర్యాయం కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు