డీసీసీబీ టర్నోవర్‌ రూ.600 కోట్లు

24 Aug, 2016 19:40 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న జనార్దన్‌
  • రూ.1000 కోట్లకు పెంచుతాం
  • ఆ దిశగా అడుగులు
  • డీసీసీబీ నోడల్‌ ఆఫీసర్‌ జనార్దన్‌
  • పాపన్నపేట: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వార్షిక టర్నోవర్‌ రూ.600 కోట్లకు చేరుకుందని దాన్ని రూ.వెయ్యి కోట్లకు పెంచాలన్న చైర్మన్‌ ఆదేశం మేరకు  కార్యాచరణ రూపొందించినట్టు డీసీసీబీ నోడల్‌ ఆఫీసర్‌ జనార్దన్‌, డైరక్టర్‌ పి.మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం పాపన్నపేటలోని పీఏసీఎస్‌లో జరిగిన వినియోగదారుల సమావేశంలో వారు మాట్లాడారు. అన్నదాతలకు అండగా నిలిచేందుకు డీసీసీబీల ద్వారా ట్రాక్టర్లు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు అందజేస్తున్నామన్నారు.

    రైతులకు టూవీలర్స్‌కు కూడా రుణాలు ఇస్తున్నామని చెప్పారు. త్వరలో గ్రామీణ బ్యాంకుల్లో 30 ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కస్టమర్‌ ఏటిఎంలను ఐదింటిని నెలకొల్పుతామన్నారు. డిపాజిటర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందజేస్తామన్నారు. ఇతర బ్యాంకుల కన్నా 1.5 శాతం వడ్డీని ఎక్కువగా చెలిస్తామన్నారు. కార్యక్రమంలో మేనేజర్‌ శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు