పెండ్లికొడుకు అలంకరణలో చినవెంకన్న

23 Oct, 2015 09:27 IST|Sakshi
పెండ్లికొడుకు అలంకరణలో చినవెంకన్న

ద్వారకా తిరుమల: ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. వైశాసన ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ నెల 30 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అప్పటి వరకు అన్ని అర్జిత సేవలు రద్దు చేశారు.

నేడు శ్రీవారిని పెండ్లి కుమారునిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా రోజుకో వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. 27 వ తేదీ రాత్రి 9 గంటలకు కల్యాణం, 28 న రాత్రి 7 గంటలకు రథోత్సవం జరుగనుంది. 30 వ తేదీ రాత్రి 9 గంటలకు శ్రీ పుష్పయాగం, పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో వేండ్ర త్రినాథ రావు తెలిపారు.

క్షేత్రానికి వచ్చే భక్తులకు కనువిందు చేసేలా దేవస్థానం అధికారులు ఆలయ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అన్నమాచార్యుని విగ్రహం, సన్డైల్, ఉపాలయాలలో పచ్చదనం. 40 అడుగుల గరుత్మంతుని విగ్రహం, ఆంజనేయస్వామి విగ్రహం ఆకట్టుకుంటున్నాయి. సుమారు రూ. 25 లక్షలతో స్వామి వారి ప్రచార  రథాన్ని ఆకర్షణాయంగా తీర్చిదిద్దారు.
 

మరిన్ని వార్తలు