రాజీవ్‌శర్మ ఆల్‌రౌండర్

1 Dec, 2016 03:33 IST|Sakshi
రాజీవ్‌శర్మ ఆల్‌రౌండర్
  • రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు నిబద్ధతతో పనిచేశారు: సీఎం కేసీఆర్
  • అధికారులను ధైర్యంగా ముందుకు నడిపించారు
  • ఆయన కృషి వల్లే ఒక్కరోజులోనే ‘సమగ్ర సర్వే’ చేయగలిగాం
  • సచివాలయంలో రాజీవ్‌శర్మకు ఘనంగా వీడ్కోలు
  • ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియామకం
  • సీఎంకు రుణపడి ఉంటా: రాజీవ్‌శర్మ
  • సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్‌శర్మ నిబద్ధతతో పనిచేశారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొనియాడారు. రాష్ట్ర విభజన సమయంలో తలెత్తిన విపత్కర పరిస్థి తుల్లోనూ రాజీవ్ శర్మ ధైర్యంగా పనిచేశారని ప్రశంసించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఓపికగా తన బాధ్యతలు నిర్వహించారని, ప్రభుత్వ కార్యక్రమాలన్నిం టా అధికారులను అదే తీరుగా ముందుకు నడిపించారని అన్నారు.

    గడిచిన రెండున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం దాదాపు పది పన్నెండు అవార్డులు అందుకుందన్నారు. రాజీవ్‌శర్మ వీడ్కోలు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సచివాలయంలో ఘనంగా నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో పూర్తి చేయ గలిగామంటే అది రాజీవ్‌శర్మ కృషి ఫలితమేన న్నారు.

    ఇటీవల హరియాణాలో అదే తరహా సర్వే చేయించేందుకు అక్కడి ముఖ్యమంత్రి తెలంగాణకు వెళ్లి అధ్యయనం చేసి రావాలంటూ అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపించారని గుర్తు చేశారు. కొత్త రాష్ట్రమై నప్పటికీ మన అనుభవాలను ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, రాజీవ్‌శర్మలాంటి అధికారులు ఉండటం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించటంలో ఆయన పాత్ర మరవలేనిదని గుర్తు చేశారు. కొత్త కలెక్టర్లు, ఎస్పీలు, 16,500 మంది ఉద్యోగుల నియామకాలన్నీ ఒడిదుడు కులు లేకుండా సాఫీగా పూర్తి చేయగలిగారని అభినందించారు. విభజన చట్టంలో ప్రతి పేజీ, ప్రతి అంశంపై రాజీవ్‌శర్మకు పట్టు ఉందని, అందుకే ఏపీ నుంచి, కేంద్రం నుంచి ఎదురైన సవాళ్లను సునాయాసంగా అధిగమించారని చెప్పారు.
     
    ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా..
    తెలంగాణ ప్రథమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అందించిన సేవలను ప్రభుత్వం చిరకాలం గుర్తుంచుకుంటుందని సీఎం అన్నా రు. పదవీ విరమణ చేసినప్పటికీ ఆయన సేవ లను విస్తృతంగా వినియోగిం చుకుంటామని చెప్పారు. అందుకే ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు ఆయనను చీఫ్ సెక్రటరీగానే భావించి సమీక్షలకు హాజరు కావాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్ ఏర్పడి నపుడు తొలి సీఎస్‌గా పని చేసిన శివరాజ్‌సింగ్ సేవలను పదవీ విరమణ తర్వాత కూడా అక్కడి ప్రభు త్వం వినియోగిం చుకుంటోందన్నారు.

    ఆయన సేవలకు గుర్తింపుగా కేబినెట్ హోదా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారని, పద మూడేళ్ల తర్వాత కూడా శివరాజ్‌సింగ్ అదే హోదాలో ఉన్నారని గుర్తు చేశారు. ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన రాజీవ్ శర్మ  సెంచరీ చేశారన్న కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర మాటలతో సీఎం ఏకీభవించారు. ఓపెనింగ్ బ్యాట్స్ మెనే కాదని.. రాజీవ్‌శర్మ ఆల్‌రౌండర్ అని కితాబిచ్చారు. అధికారిగా ఉండే పరిమితులు ఇప్పుడు లేకపోవటంతో ఆయన సేవలు రాజకీయంగానూ వాడుకునే అవకాశముందని అన్నారు. మరింత ఉత్సాహంతో పని చేయాలని కోరారు.
     
    ప్రదీప్‌చంద్ర సమర్థుడు: సీఎం
    కొత్త సీఎస్‌గా నియమితులైన ప్రదీప్ చంద్ర నైపుణ్యమున్న అధికారి అని, ఎంతో ఓపికతో పని చేసే గుణముందని సీఎం ప్రశంసించారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం(టీఎస్‌ఐపాస్) రూపకల్పన సమయంలో ఆయనతో ఇరవై ముప్పై సార్లు చర్చోపచర్చలు చేశామన్నారు. చెప్పిన మార్పుచేర్పులన్నీ సమకూర్చి ప్రపంచ దృష్టినీ ఆకర్షించే విధానాన్ని తయారు చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా పూలమాలలు, శాలువాతో రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
     
    జీవితంలో దక్కిన గొప్ప గౌరవం: రాజీవ్‌శర్మ
    ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను ఎంతగానో రుణపడి ఉంటానని రాజీవ్ శర్మ అన్నారు. ఈ అవకాశం జీవితంలో తనకు దక్కిన గొప్ప గౌరవ మని పేర్కొన్నారు. తెలంగాణకు తన సేవలు కొనసాగిస్తానని, కొత్తగా అప్పగిం చిన బాధ్యతలు మరింత చక్కగా నిర్వహి స్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నూతన సీఎస్ ప్రదీప్ చంద్ర, మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, చందూలాల్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పలు వురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌శర్మను సీఎం, మంత్రు లు, అధికారులు ఘనంగా సత్కరించారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. వివిధ ఉద్యోగ సంఘాలు, అధికారులు కూడా ఆయనను ఘనంగా సన్మానించి ఆత్మీ యంగా వీడ్కోలు పలికారు.

మరిన్ని వార్తలు