భయాగ్నస్టిక్స్!

12 Jul, 2016 02:11 IST|Sakshi
భయాగ్నస్టిక్స్!

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్లు
అనుమతుల్లేకుండానే పరీక్షల నిర్వహణ
అక్రమంగా కొనసాగుతున్న కేంద్రాలు 519
రెన్యువల్‌కు దరఖాస్తుల చేసుకోని కేంద్రాలు
వైద్య, ఆరోగ్య శాఖ పరిశీలనలో వాస్తవాలివి..

జిల్లాలో డయాగ్నస్టిక్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నారుు. నిబంధనలను అసరించి తెరవాల్సిన ఈ కేంద్రాలు.. అనుమతుల్లేకుండానే కొనసాగుతున్నారుు. ఇందులో కార్పొరేట్ ఆస్పత్రులకు అనుబంధంగా నడుస్తున్నవే అధికం. పీసీపీఎన్ డీటీ (లింగనిర్ధారణ) చట్టం ప్రకారం జన్యు ప్రయోగశాలలు, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుకు వైద్య, ఆరోగ్య శాఖ అనుమతి తప్పనిసరి. కానీ జిల్లాలో అనుమతి లేకుండా 519 డయాగ్నస్టిక్ సెంటర్లు నడుస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ  గణాంకాలు  చెబుతున్నారుు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం 934 డయాగ్నస్టిక్ సెంటర్లు నడుస్తున్నారుు. ఈ కేంద్రాలు ఏటా పరీక్షల తాలూకు వివరాలు సమర్పించి గుర్తింపు కోసం రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. తొలుత అనుమతి తీసుకున్నప్పటికీ.. రెన్యూవల్ తప్పనిసరి. కానీ జిల్లాలో సగానికిపైగా రెన్యూవల్ చేరుుస్తున్న దాఖలాల్లేవు. జిల్లాలో 415 డయాగ్నస్టిక్ కేంద్రాలకు మాత్రమే ప్రస్తుతం అనుమతులున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నారుు. మిగతా 519 కేంద్రాలు యంత్రాంగం నుంచి అనుమతి తీసుకోలేదు. ఈ క్రమంలో ఆయా సెంటర్లలో చేసే పరీక్షలు పరిగణలోకి తీసుకోకూడదు. కానీ పలు ఆస్పత్రులు వీటినే రిఫర్ చేస్తూ పేషంట్లను పంపడం గమనార్హం.

పర్యవేక్షణ గాలికి..
అనుమతిలేని డయాగ్నస్టిక్, అల్టా్ర సౌండ్ స్కానింగ్ సెంటర్లపై వైద్య, ఆరోగ్య శాఖ నిఘా ఏర్పాటు చేయాలి. కానీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఈ ప్రక్రియలో విఫలమవుతోంది. పీసీపీఎన్ డీటీ చట్టం ప్రకారం అనుమతి లేని కేంద్రాల పట్ల యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలి. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి పనితీరును పర్యవేక్షించాలి. కానీ జిల్లాలో రెండేళ్లుగా వైద్యశాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భాలు లేవు. దీంతో జిల్లాలో 519 కేంద్రాలు అనుమతి లేనప్పటికీ కార్యకలాపాల్ని దర్జాగా నిర్వహిస్తున్నారుు.

మరిన్ని వార్తలు