నేటినుంచి కనకాద్రిస్వామి జాతర

26 Aug, 2016 19:58 IST|Sakshi
నారాయణపేట రూరల్‌ : మండలంలోని అభంగాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని నెమ్మళ్లపల్లిలో శని, ఆదివారం కనకాద్రి స్వామి జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, సాయంత్రం జల్దిబిందె ఊరేగింపు, రాత్రి రెట్టపట్ల కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ రెట్టపట్ల కార్యక్రమంలో ఐదుగురిని ఓడిస్తే వెండి కడియం, ముగ్గురిని ఓడిస్తే ఒక టెంకాయను బహూకరిస్తామన్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు మహా రథోత్సవం ఉంటుందని తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కనకాద్రి కపకు పాత్రులు కావాలని కోరారు. 
 
 

 

మరిన్ని వార్తలు