దవళేశ్వరం వద్ద ఉధృతంగా గోదావరి

13 Jul, 2016 08:29 IST|Sakshi

రాజమండ్రి: ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువనుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో నీటిమట్టం 14.7 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 14.61 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. గోదావరి ఉధృతితో 71 గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. పీ.గన్నవరంలో 38 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

అయినవెల్లి మండలం వెదురుబీడెం కాజ్వే పైకి వరద రావడంతో ఏడు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోనసీమలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు 12 లాంచీలు, 100 పడవలు ఏర్పాటుచేశారు.
 

>
మరిన్ని వార్తలు