జనగామ జిల్లా ఏర్పడుతుందని నమ్ముతున్నా

3 Oct, 2016 00:42 IST|Sakshi
జనగామ : ‘జనగామ జిల్లా చేయాలని సీ ఎం కేసీఆర్‌కూ ఉంది.. ఎన్నికల సమయం లో ఇచ్చిన మాట తప్పకూడదని భావిస్తున్నారు..’ అని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జిల్లా సాధన కోసం కొనసాగుతున్న రిలే దీక్షల శిబిరాన్ని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యా దగిరిరెడ్డితో కలిసి దయాకర్‌రావు సందర్శించి, సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనగామ జిల్లా చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరిన సమయంలో మొదట్లో ప్రజలు సుముఖంగా లేరనే అభిప్రాయం వ్యక్తం చేశారని, మహబూబాబాద్‌ లాంటి చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్నందున జనగామను కూడా ఆలోచించాలని కోరినట్లు చెప్పారు. జనగామ జిల్లా చేస్తే పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాలకు తోడు అదనంగా రాయపర్తి, తొర్రూరు మండలాల ప్రజలకు ఇష్టం లేకున్నా, ఎలాంటి అభ్యం తరం లేదని సీఎంతో అబద్ధం ఆడాల్సి వచ్చిందన్నారు. స్టేష¯ŒSఘ¯ŒSపూర్‌లోని మండలాలను సైతం జనగామలో కలిపేందుకు ఎమ్మెల్యే రాజయ్య సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ముగ్గురు ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వరెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి జనగామ జిల్లా ఏర్పాటుకు ఏకాభిప్రాయంతో సీఎం వద్దకు వెళ్తామన్నారు. సీఎం ఆలోచనలో మార్పు కనిపిస్తోందని, జిల్లా ఏర్పడుతుందనే పూర్తి విశ్వాçÜం తనకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్స¯ŒS గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, డాక్టర్లు లక్షి్మనారాయణ, రాజమౌళి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్ష, గౌరవాధ్యక్షులు పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, బొట్ల శ్రీనివాస్, సంపత్, సతీష్, కనకారెడ్డి పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు