ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఉద్యోగుల మహాధర్నా

19 Sep, 2016 23:38 IST|Sakshi
ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఉద్యోగుల మహాధర్నా
 
గుంటూరు మెడికల్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట మహా ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నా నుద్దేశించి సంఘం జిల్లా అధ్యక్షుడు కోడిరెక్క కోటిరత్నం మాట్లాడుతూ  గత మూడేళ్ళుగా ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా ఉద్యోగులను మానసికంగా వేధిస్తున్నారన్నారు.  చదువుకు, హోదాకు తగ్గ వేతనం ఇవ్వాలని, ఈపిఎఫ్‌ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని, ప్రతినెలా ఒకటో తేదీకల్లావేతనాలు ఇవ్వాలని, హెచ్‌ ఆర్‌ పాలసీ అమలు చేయాలని, ప్రస్తుతం ధరలు పెరిగిన దష్ట్యా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ నియంత్రణ కోసం పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ వైద్యులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాశిస్టులు, స్టాఫ్‌నర్సులు, కౌన్సిలర్‌లు, డేటా మేనేజర్లు, కేర్‌ కో ఆర్డినేటర్లు, తదితరులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. మహాధర్నాలో యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జ్యోతుల వీరాస్వామి, జిల్లా సెక్రటరీ శ్రీనివాసరావు, మహిళా విభాగం కన్వీనర్‌ స్వర్ణలత, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ నివారణ మండలి ప్రాజెక్ట్‌ మేనేజర్‌ లంకపల్లి మధుసూధనరావు, షిప్‌ అధ్యక్షురాలు రమాదేవి, టీఎన్‌పీ ప్లస్‌ అధ్యక్షులు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా పరిషత్‌ కార్యాయంలో జరిగిన కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో  డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు అందజేశారు.
 
 
మరిన్ని వార్తలు