ఎంఎస్‌కే నియామకం జిల్లా క్రికెట్‌కు మేలు

23 Sep, 2016 23:36 IST|Sakshi

ఏలూరు రూరల్‌ : భారత క్రికెట్‌ జట్టు సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఎంఎస్‌కే ప్రసాద్‌ నియామకం జిల్లాకు మేలు చేస్తుందని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి, ఎంపీ గోకరాజు గంగరాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో టెక్నికల్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న ప్రసాద్‌ ఏలూరు భోగాపురం వద్ద అసోసియేషన్‌కు క్రికెట్‌ గ్రౌండ్‌ కోసం స్థలం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. భీమవరం డీఎన్‌ఆర్‌ కళాశాల క్రికెట్‌ గ్రౌండ్‌ ఏర్పాటు చేయడంలో ప్రసాద్‌ కీలకపాత్ర పోషించారన్నారు. మంగళగిరిలో అండర్‌–14, కడపలో అండర్‌–17, విజయనగరంలో అండర్‌–19 అకాడమీతో పాటు గుంటూరు జేకేసీ కళాశాలలో మహిళా క్రికెట్‌ అకాడమీ స్థాపనకు ముఖ్య భూమిక పోషించినట్టు చెప్పారు. జిల్లాకు చేసిన సేవలకు గుర్తుగా మంగళగిరిలో ఆయనను ఘనంగా సన్మానించామని వివరించారు. జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గోకరాజు రామరాజు, ఎం.నగేష్‌కుమార్, వి.విద్యాప్రసాద్, బీఎస్‌ మంగేష్, ఎండీఎఫ్‌ రహమాన్, కె.రామచంద్రరావు, బాపూజీ పాల్గొన్నారు

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు