ఘనంగా కాల భైరవ హోమం

4 Feb, 2017 23:22 IST|Sakshi
ఘనంగా కాల భైరవ హోమం
అమలాపురం టౌన్‌  : 
స్థానిక గౌతమ మహ ర్షి గో సంరక్షణ సమితి గోశాల నూతన ప్రాంగణంలో కాలభైరవ హోమం ఘనంగా నిర్వహిస్తున్నారు. లోక కల్యాణార్థం 42 గం టల పాటు నిర్విరామంగా నిర్వహించే కాలభైరవ లక్ష గారెల హోమం శుక్రవారం రాత్రి ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో రో జు శనివారం కూడా కొనసాగింది. భక్తుల తాకిడితో గోశాల కిటకిటలాడింది. 1045 కిలోల మినపప్పు, 540 లీటర్ల నూనెతో గా రెల వండేందుకు స్వచ్ఛంద సేవకు ముం దుకు వచ్చిన దాదాపు 400 మంది మహిళ లు రేయంబవళ్లు వండుతూనే ఉన్నారు. గారెలను కాల భైరవుని చిత్ర పటం ముం దు ఉంచి నైవేద్యం సమర్పించిన తర్వాత వాటిని హోమంలో వేస్తున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు పూర్ణాహుతితో హోమం ముగుస్తుంది. శనివారం మధ్యాహ్నం జరిగిన అన్న సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గోశాల ప్రాంగణంపై నుంచి డ్రో¯ŒS కెమెరాతో హోమం, గారెల వంటకం, భక్తుల రాక వంటి దృశ్యాలను చిత్రీకరించారు. పట్టణ ప్రముఖులు హోమంలో పాల్గొన్నారు. గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఈ క్రతువు జరుగుతోంది. వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ చైర్మ¯ŒS చిక్కాల గణేష్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మ¯ŒS మెట్ల రమణబాబు, డీఎస్పీ ఎల్‌.అంకయ్య, పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ తదితరులు పూజల్లో పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు