వెటర్నరీ కళాశాల అసోసియేట్‌ డీన్‌కు అవార్డు

7 Sep, 2016 22:36 IST|Sakshi
  • సీఎం చేతుల మీదుగా నేడు పురస్కారం
  • కోరుట్ల: కోరుట్ల వెటర్నరీ కళాశాల అసోసియేట్‌ డీన్‌ టి.రఘునందన్‌కు ఉన్నత విద్యలో ఉత్తమఅధ్యాపక అవార్డు వచ్చింది. రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాన్ని సీఎం చేతుల మీదుగా గురువారం అందుకోనున్నారు. హన్మకొండకు చెందిన రఘునందన్‌ హైదరాబాద్‌లో 1990లో ఎంవీఎస్సీ కోర్సు, 2006లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. 1993లో ఆముదాలవలస అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌గా నియమితులయ్యారు.
     
    25ఏళ్లుగా పలు హోదాల్లో ప్రొఫెసర్‌గా పనిచేసి 2012లో అసోసియేట్‌ డీన్‌గా పదోన్నతి పొందారు. మే నెలలో కోరుట్ల వెటర్నరీ డీన్‌గా నియమితులయ్యారు. రాజేంద్రనగర్‌ వెటర్నరీ యూనివర్సిటీలో అంతరించిపోతున్న దక్కన్‌ గొర్రెల జాతిపై పరిశోధనలు, అండర్‌గ్రాడ్యూయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు మేజర్‌ అడ్వైజర్‌గా, వివిధ అంతర్జాతీయ సెమినార్ల పరిశోధన పత్రాలు పరిశోధించారు. రేడియో, టెలివిజన్‌ కార్యక్రమాల్లో గొర్రెలు, పశువులు, మేకలు, పందుల పెంపకందార్లకు సూచనలు అందిస్తూ అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించారు.
     
    2014లో నెస్స్‌ ఫౌండేషన్‌ నుంచి రైతుబంధు అవార్డు అందుకున్నారు. ఇండియన్‌ డెయిరీ అసోసియేషన్, ఇండియన్‌ సొసైటీఫర్‌ ఎనిమల్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, స్మాల్‌ రూమినెంట్‌ సొసైటీ, న్యూట్రిషన్‌ సొసైటీ వంటి సంస్థల్లో ఆయన జీవిత కాల సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు. 2015లో వారంపాటు ఫ్రాన్స్‌ వెళ్లి అక్కడ అర్బినెట్‌ ప్రాజెక్టులో కరువులో పశుగ్రాసాలు అన్న అంశంపై జరిగిన వర్క్‌షాపులో పాల్గొన్నారు. విద్యాబోధనతో పాటు పశువైద్యం, పెంపకం, పోషణలో పరిశోధనలు నిర్వహించిన క్రమంలో యూనివర్సిటీస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా టి.రఘునందర్‌ ఎంపిక కావడం విశేషం.
     
    బాధ్యతలను పెంచింది
    ఉత్తమ పురస్కారం నా భాధ్యతను మరింత పెంచింది. పశుసంరక్షణ, పెంపకం, పోషణ వంటి అంశాల్లో రైతులకు ప్రయోజనకర అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తా.   రైతులు నేరుగా వెటర్నరీ కళాశాలకు వచ్చి పశుపెంపకంలో మెలకువలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తాం.
    –రఘునందన్, అసోసియేట్‌ డీన్, కోరుట్ల
మరిన్ని వార్తలు