గ్రంథాలయాలకు నిర్లక్ష్యపు చెదలు

14 Nov, 2016 21:48 IST|Sakshi
గ్రంథాలయాలకు నిర్లక్ష్యపు చెదలు
  • రూ.16 కోట్ల సెస్‌ బకాయిలు
  • మూతపడుతున్న గ్రామీణ గ్రంథాలయాలు
  • భర్తీకి నోచుకోని 130 లైబ్రేరియ¯ŒS పోస్టులు
  • 14 నుంచి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు
  • రాయవరం : 
    పిల్లలకు విజ్ఞానం, వినోదం..నిరుద్యోగులకు మేథాశక్తి, పెద్దలకు ఆధ్యాత్మికతను అందించే పుస్తకాలు దొరికే ఏకైక చోటు గ్రంథాలయం. విజ్ఞాన భాండాగారాలుగా వెలుగొందే ఈ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అందుకే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో..కాని ఓ మంచి పుస్తకం కొనుక్కో..అంటూ కందుకూరి వీరేశలింగం పంతులు అన్నారు. ప్రస్తుతం పుస్తక భాండాగారాలైన గ్రంథాలయాలు  సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సోమవారం నుంచి నుంచి 20 వరకు  గ్రంథాలయ వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో గ్రంథాలయాల పరిస్థితిపై ’సాక్షి’ కథనం. 
    శాశ్వత భవనాలేవి..
    జిల్లా కేంద్రమైన కాకినాడలో సెంట్రల్‌ లైబ్రరీ ఉంది. జిల్లాలో 98 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. శాఖాగ్రంథాలయాల్లో 58 సొంత భవనాల్లో, 11అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 29 అద్దె లేకుండా పంచాయతీ భవనాల్లో కొనసాగుతున్నాయి. సొంత భవనాల్లో ఏలేశ్వరం, సవరప్పాలెం, మలికిపురం తదితర లైబ్రరీలు శిథిలస్థితికి చేరాయి. ఎక్కువగా శాఖా గ్రంథాలయాలు గాలి, వెలుతురు లేని ఇరుకుగదుల్లో నిర్వహిస్తున్నారు. 
    సెస్‌ బకాయిలు రూ.16కోట్లు..
    జిల్లాలో రాజమండ్రి, కాకినాడ నగర పాలక సంస్థలు రూ.14కోట్ల వరకు గ్రంథాలయ పన్నును చెల్లించాల్సి ఉంది. తుని, అమలాపురం, రామచంద్రపురం తదితర మున్సిపాలిటీలు, పలు పంచాయతీల నుంచి గ్రంథాలయ పన్నుగా రూ.రెండుకోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. సెస్‌ బకాయిలు గ్రంథాలయాలకు గుదిబండలా తయారవుతున్నాయి. 
    ఒక్కొక్కటిగా మూతపడుతున్న గ్రామీణ గ్రంథాలయాలు..
    జిల్లాలో 49 గ్రామీణ గ్రంథాలయాలు ఉండగా వీటిలో 25 గ్రామీణ గ్రంథాలయాలు మూతపడ్డాయి. అలాగే 161 పుస్తక నిక్షిప్త కేంద్రాలకు 145 పనిచేస్తున్నాయి. ఏటా కోల్‌కత్తాలో ఉన్న రాజారామ్మోహ¯ŒSరాయ్‌ లైబ్రరీ ఫౌండేష¯ŒS నుంచి జిల్లాకు పుస్తకాలు వస్తున్నాయి. 
    జిల్లాలో గ్రంథాలయాలు..
    కేంద్ర గ్రంథాలయం –1, గ్రేడ్‌–1 గ్రంథాలయాలు – 5, గ్రేడ్‌–2 గ్రంథాలయాలు – 11 , గ్రేడ్‌–3 గ్రంథాలయాలు–82, గ్రామీణ గ్రంథాలయాలు – 45. వీటిలో 24 పనిచేస్తున్నాయి. 
    వారోత్సవాలకు రెట్టింపు నిధులు..
    గతేడాది కన్నా వారోత్సవాల నిర్వహణ ఖర్చును రెట్టింపు చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రూ.20వేల నుంచి రూ.35 వేలకు, గ్రేడ్‌–1 గ్రంథాలయానికి రూ.ఐదు వేల నుంచి రూ.10వేలకు, గ్రేడ్‌–2 గ్రంథాలయానికి రూ.4వేల నుంచి రూ.7వేలకు, గ్రేడ్‌–3 గ్రంథాలయానికి రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచారు. గ్రామీణ గ్రంథాలయానికి రూ.1,000 చొప్పున మంజూరు చేశారు.
     
    సిబ్బంది లేమి..
    జిల్లాలో 204 లైబ్రరీ పోస్టులకుగాను 77 మంది రెగ్యులర్, 35 మంది ఔట్‌సోర్సింగ్‌లో విధులు నిర్వహిస్తుండగా 102 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్నేళ్లుగా ల్రెబ్రేరియ¯ŒS పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. మండల పరిధిలో ఉన్న శాఖా గ్రంథాలయాల్లో సరైన మౌలిక సదుపాయాలు కరవవుతున్నాయి. పలుచోట్ల మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేదు. చాలా చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకుంటుండగా, కొన్ని చోట్ల నామమాత్రపు అద్దెతో కాలం వెళ్లదీస్తున్నాయి.
     
    వారోత్సవాలు ఇలా..
    ‘14న జాతీయ గ్రంథాలయాల వారోత్సవాలు ప్రారంభం. బాలల దినోత్సవం నిర్వహిస్తారు. 15న పుస్తక సంస్థల సహకారంతో పుస్తక ప్రదర్శన. 16న గ్రంథాలయ రంగంలో ప్రముఖులతో సమావేశం. 17న కవులు, పండితులు, విద్యావేత్తలు, రచయితల సహకారంతో సదస్సులు. 18న ఉన్నత కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వకృ్తత్వ, క్విజ్, ఆటల పోటీల నిర్వహణ. 19న మహిళా దినోత్సవం. 20న అక్షరాస్యతా దినోత్సవం. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు.
     
మరిన్ని వార్తలు