సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి

28 Jul, 2016 23:24 IST|Sakshi
సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి
భువనగిరి : కాంట్రాక్టు రెండో ఏఎన్‌ఎంల సమస్యల పరిష్కారానికి సమరశీలంగా ఉద్యమించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. భువనగిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట రెండో ఏఎన్‌ఎంలు నిర్వహిస్తున్న సమ్మె గురువారం 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి సమ్మెకు సంఘీబావం తెలిపి మాట్లాడారు. ఎన్నికల ముందు వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ అధికారంలోకి రాగానే మర్చిపోయారని విమర్శించారు. 11 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని, దీన్ని ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, తుర్కపల్లి సురేందర్, దాసరి పాండు, జంగయ్య, శ్రీనివాస్, ఏఎన్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు కైరంకొండ సరస్వతి, ఫర్వీన్, అనిత, నీలిమ, ధనలక్ష్మి, జయశ్రీ, సునంద, సునీత, మమత, విజయరాణి, సువర్ణ, కవిత ఉన్నారు.
 
>
మరిన్ని వార్తలు