బాలికలు ఝూన్సీలక్ష్మీబాయిలా పోరాడాలి

28 Jan, 2017 23:03 IST|Sakshi
బాలికలు ఝూన్సీలక్ష్మీబాయిలా పోరాడాలి
  • కలెక్టర్‌ హోదా సాధించడమే లక్ష్యం
  • బాలికలు ధైర్యంతో ముందుకు సాగాలి
  • ప్రముఖ బాల మేధావి నైనా జైశ్వాల్‌
  • పెద్దాపురం : 
    బాలికలు భయపడకుండా ఝూన్సీలక్ష్మీబాయిలా పోరాడే తత్వాన్ని అలవర్చుకోవాలని దక్షిణ తూర్పు ఆసియాలోనే నంబర్‌ వ¯ŒS టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణిగా పేరొందిన బాల మే«ధావి, ఐటీటీఎఫ్‌కు ఎంపికైన తొలి భారతీయ బాలిక నైనా జైశ్వాల్‌ సూచించారు. పెద్దాపురం శ్రీ ప్రకాష్‌ సినర్జీ పాఠశాలను తన కుటుంబ సభ్యులతో కలసి శనివారం ఆమె సందర్శించారు. పాఠశాల డైరెక్టర్‌ సిహెచ్‌.విజయ్‌ప్రకాష్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆమె తన మనోగతాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. ప్రస్తుతం తాను జర్నలిజంలో పీహెచ్‌డీ చేస్తున్నట్టు చెప్పారు. కలెక్టర్‌ హోదా సాధించి దేశానికి సేవ చేయాలన్నది తన లక్ష్యమని తెలిపారు. బాలికలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకుండా ధైర్యంతో ముందుకు దూసుకుపోయే తత్వం అలవర్చుకోవాలని సూచిం చారు. తన 8వ సంవత్సరంలోనే పదో తరగతి పూర్తి చేసిన విధానాన్ని వివరించారు. ఏ రంగంలో నైనా కష్టపడి కాకుండా ఇష్టపడి పని చేస్తే విజయం మన వెంటే ఉంటుందన్న ఆత్మ విశ్వాçÜంతో ముందుకు వెళ్తున్నానని చెప్పారు.
    విజయ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ చిన్న వయసులోనే విద్యతో పాటు టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) పోటీల్లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి గుర్తింపు సాధించిన జైశ్వాల్‌ను అభినందించారు. జైశ్వాల్‌ సోదరుడు ఆగత్య మాట్లాడుతూ తాను 8వ ఏటే పాఠశాల విద్యను పూర్తి చేసి ఇంటర్‌ చదువుతున్నానన్నాడు. 
    జైశ్వాల్‌ తండ్రి శ్రీఅశ్వి¯ŒS జైశ్వాల్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపితే వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పారు. శ్రీ ప్రకాష్‌ పాఠశాల 11వ తరగతి విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నైనా పాల్గొన్నారు. వారితో కలసి ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీ¯ŒS రాజేశ్వరి, కిడ్స్‌ ప్రిన్సిపాల్‌ దుర్గ, టీటీ జిల్లా అధ్యక్షుడు చిన్నారావు, లైజ¯ŒS ఆఫీసర్‌ ఎం.సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.  
     
    ‘నన్నయ’లో పరిశోధన  చేయాలని ఉంది  : నైనా 
    ఆమోదం తెలిపిన వీసీ ముత్యాలునాయుడు
    రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : ఇక్కడి వాతావరణం, ప్రశాంతత తనకు ఎంతో నచ్చాయని, ఇక్కడే పరిశోధన (పీహెచ్‌డీ) చేయాలనే కోరిక కలుగుతోందని’ బాలమేధావి, టెబుల్‌టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌ అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీని శనివారం ఆమె తన తల్లిదండ్రులు, సోదరుడితో కలసి సందర్శించారు. తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కెఎస్‌ రమేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థులనుద్దేశించి ఆమె మాట్లాడారు. ఎన్నో విలువైన విషయాలను చెప్పారు. ఈ సందర్భంగా నైనా జైశ్వాల్‌ని సత్కరిస్తూ, ఆమె కోరిన విధంగా తమ యూనివర్సిటీలో క్రీడాకారిణిగా పరిశోధన చేసేందుకు అనుమతి ఇస్తున్నామని వర్సిటీ వీసీ ఆచార్య ఎం.ముత్యాలునాయుడు ప్రకటించారు. కార్యక్రమంలో రిజిస్టార్‌ ఆచార్య ఎ.నరసింహరావు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 
     
మరిన్ని వార్తలు