వానపాముల అక్రమ రవాణా గుట్టు రట్టు

8 Sep, 2016 01:38 IST|Sakshi
వానపాముల అక్రమ రవాణా గుట్టు రట్టు
 
  •  టోల్‌ప్లాజా వద్ద 8 బ్యాగులు స్వాధీనం  
వెంకటాచలం : చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వానపాముల అక్రమణ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. వెంకటాచలం పోలీసులకు కొందరు సమాచారం ఇవ్వడంతో పోలీసులు బుధవారం నిఘా ఉంచి 8 వానపాముల బ్యాగులను, ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకు చెందిన పార్థసారథి, ఈశ్వర్‌ తరచూ చెన్నై నుంచి నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఒంగోలు తదితర ప్రాంతాలకు తరచూ వానపాములు  అక్రమ రవాణా చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఏపీ27ఏఎక్స్‌ 5589 ఇన్నోవా కారులో పార్థసారథి, ఈశ్వర్‌ చెన్నై నుంచి ఒంగోలుకు వానపాముల బ్యాగులతో బయలుదేరారు. ఈ విషయంపై వెంకటాచలం పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు టోల్‌గేట్‌కు రెండు వైపులా నిఘా ఉంచి ఇన్నోవా కారును పట్టుకున్నారు. ఈ కారులో మొత్తం 8 వానపాముల బ్యాగులు, పార్థసారథి, ఈశ్వర్‌తో పాటుగా కారుడ్రైవర్‌ను, కారును అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వానపాముల అక్రమ రవాణాపై సమాచారం అందడంతో టోల్‌గేట్‌ వద్ద నిఘా ఉంచి అదుపులోకి తీసుకున్నారు. వానపాములను, అక్రమ రవాణా చేసిన వారిని అటవీశాఖ అధికారులకు అప్పగిస్తామన్నారు. కారు డ్రైవర్‌కు ఈ రవాణాలో ప్రమేయం ఉందా లేదానని విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
మరిన్ని వార్తలు