వైద్యుల నిర్లక్ష్యంపై గర్భిణుల ఆగ్రహం

28 Jul, 2016 23:55 IST|Sakshi
వైద్యుల నిర్లక్ష్యంపై గర్భిణుల ఆగ్రహం

కదిరి టౌన్‌ : ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన గర్భిణులపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారు భగ్గువున్నారు. నడిరోడ్డుపై గురువారం ధర్నా చేశారు. పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన  జమీలా, నల్లచెరువు వుండలం కమ్మవారిపల్లి చెందిన శ్రీదేవి, తనకల్లు వుండలం గొల్లవారిపల్లికి చెందిన కవిత  ప్రసవం కోసం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చారు. వీరికి సాధారణ కాన్పు కష్టమవుతుందని, సిజేరియన్‌ చేయాలని వైద్యులు తెలిపారు. వుత్తు ఇంజక్షన్‌ ఇచ్చే వైద్యుడు లేడని , వెంటనే అనంతపురం పెద్దాస్పత్రికి గాని ప్రైవేటు నర్సింగ్‌ హోంకు గాని తరలించాలని చెప్పారు.

దీంతో ఆగ్రహించిన గర్భిణులు వారి బంధువులతో కలిసి ప్రభుత్వాసుపత్రి అత్యవసర విభాగం వద్ద ఆందోళనకు దిగారు. తర్వాత ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట వచ్చి రోడ్డుపై బైఠాయించారు. వీరికి ఆవాజ్, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు వూట్లాడుతూ గర్భిణులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టరు విజయలక్ష్మిని సస్పెండ్‌ చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. గర్భిణుల ఆందోళనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

విషయం తెలుసుకున్న ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ డా.రామక్రిష్ణయ్య, మధుసూదన్‌ అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే వారు ససేమిరా అన్నారు. చివరికి ఎస్‌ఐలు జయపాల్‌రెడ్డి, రాజేష్‌ తవు సిబ్బందితో అక్కడికి చేరుకుని  నచ్చజెప్పారు.

సీజేరియన్‌ కుదరదన్నా : ఈ విషయమై డాక్టరు విజయలక్ష్మిని వివరణ కోరగా ఈ రోజు మత్తు డాక్టరు సెలవుపై వెళ్లారని, దీంతో సిజేరియన్‌ చేయడానికి కుదరని చెప్పానన్నారు. అంతేకాని డబ్బు డిమాండ్‌ చేయలేదన్నారు.

మరిన్ని వార్తలు