ముందే పండుగ

10 Jan, 2017 23:01 IST|Sakshi
ముందే పండుగ

ఆత్మకూరు : సంక్రాంతి పండుగ ముందు వచ్చిందేమిటీ?! ఆత్మకూరు మండలం గూడెప్పాడ్‌ లోని విట్స్‌ కళాశాల ఆవరణకు సోమవారం వెళ్లి్లన వారందరికీ ఇదే భావన కలిగింది. మహిళలు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని ఆవరణ మొత్తాన్ని ముగ్గులతో నింపేయడమే దీనికి కారణం!  సాక్షి–విట్స్‌ ఆధ్వర్యాన విట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ పోటీలకు పెద్దసంఖ్యలో మహిళలు హాజరై రంగవల్లులు తీర్చిదిద్దడంతో కోలాహలం నెలకొంది. ఈ మేరకు హాజరైన పోలీసు కమిçషనర్‌ సుధీర్‌బాబు మాట్లాడుతూ వరంగల్‌ మహిళల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువని అన్నారు. మహిళల్లో ఉత్సాహం నింపడానికి ‘సాక్షి’ ముగ్గుల పోటీలు నిర్వహించడ ం అభినందనీయమన్నారు. పోటీల్లో విద్యార్థులు ఎక్కువగా పాల్గొనడాన్ని చూస్తే మన సంస్కృతి, సంప్రదాయాలు ముందు తరాలకు అందుతున్నట్లుగా భావించాల్సి వస్తోందని తెలిపారు.

సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయండి
మహిళల రక్షణ కోసం వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ ఆధ్వర్యాన అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని సీపీ సుధీర్‌బా బు తెలిపారు. ఇటీవల నిర్వహించిన స్వ శక్తి కార్యక్రమానికి గిన్నిస్‌బుక్‌లో చోటుదక్కడం వరంగల్‌ మహిళలకు గర్వకారణమన్నారు. అలాగే, మహిళలకు సమస్య ఎదురైతే 94910 89257 వాట్సప్‌ నం బర్‌కు మెసేజ్‌ పంపాలని సూచించారు. కార్యక్రమంలో విట్స్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.శ్యాంకుమార్, డైరెక్టర్‌ మహేష్, ఎం పీడీఓ నర్మద, తహసీల్దార్‌ సరిత, సాక్షి రీజనల్‌ మేనేజర్‌ రాంచంద్రారెడ్డి, వరంగల్‌ రూరల్‌ జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ భద్రారెడ్డి, సాక్షి టీవీ కరస్పాండెంట్‌ శ్రీధర్‌రెడ్డి, పరకాల సీఐ జాన్‌ నర్సింహులు, ఎస్సై లు విఠల్, రవిందర్‌ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు