పునఃశ్చరణతో నైపుణ్యాల మెరుగు

18 Jan, 2017 23:07 IST|Sakshi
పునఃశ్చరణతో నైపుణ్యాల మెరుగు
– ఎస్పీ ఆకె రవికృష్ణ 
కర్నూలు: పునఃశ్చరణ తరగతులతో నైపుణ్యాన్ని మరింత పెంచుకోవచ్చని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. ఏఆర్‌ సిబ్బందికి మొబలైజేషన్‌ తరగతులను బుధవారం.. జిల్లా పోలీసు కార్యాలయంలోని కవాతు మైదానంలో ఎస్పీ ప్రారంభించారు. ఈ తరగతులు 14 రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదటిరోజు యోగాతో తరగతులను ప్రారంభించారు. యోగా మాస్టర్‌ సత్యనారాయణమూర్తి పోలీసు సిబ్బందితో యోగాసనాలు చేయించారు. కార్యక్రమానికి ఎస్పీ ఆకే రవికృష్ణ హాజరై సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. అన్ని విభాగాల్లో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. బందోబస్తుల్లో ఉన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామంతో పాటు యోగా చేయాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు. ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ఐ.వెంకటేష్, ఆర్‌ఐలు రంగముని, జార్జి, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్‌ సిబ్బంది పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు