స్టోర్లలో సరుకులు ఉచితం కాదు

1 Dec, 2016 23:36 IST|Sakshi

అనంతపురం అర్బన్‌: ప్రభుత్వ చౌక దుకాణా(స్టోర్ల)ల్లో నిత్యావసర సరుకులు ఈ నెల ఉచితంగా ఇవ్వడం లేదు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సరుకులు తీసుకునేందుకు వచ్చే కార్డుదారులు డబ్బులు ఇవ్వలేకపోతే వారికి అప్పు కింద ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వీలైనంత వరకు అందరికీ ఈ నెల అప్పు పద్ధతిలోనే సరుకులు పంపిణీ చేయాలని డీలర్లను అధికారులు ఆదేశించారు. ఈ నెల సరుకులకు కార్డుదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని, జనవరి నెలలో సరుకులు తీసుకున్నప్పుడు రెండు నెలల మొత్తాన్ని స్వైపింగ్‌ ద్వారా కార్డుదారుల ఖాతాల నుంచి తీసుకోవాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

 

>
మరిన్ని వార్తలు