ఆ బ్రాండ్‌కు డిమాండ్‌ లేకే..

10 Jun, 2017 00:06 IST|Sakshi

భూటాన్‌ దేశం బీర్లు నేల పాలు!
కాలం చెల్లడంతో పారబోత


మాక్లూర్‌(ఆర్మూర్‌): ఎండ కాలంలో బీర్లకు ఎం తో డిమాండ్‌ ఉంటుంది. కానీ ఓ బ్రాండ్‌ బీర్లను ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో కాలం చె ల్లాయి. దీంతో వాటిని పారబోయాల్సి వచ్చిం ది. మాక్లూర్‌ మండలంలోని మాదాపూర్‌ సమీ పంలోని తెలంగాణ రాష్ట్ర బేవరేజేస్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌(ఐఎంఎల్‌ డిపో)కు నుంచి జిల్లా వ్యా ప్తంగా మద్యం సరఫరా అవుతుంది. జిల్లాలో భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు సాగుతుం టాయి. కానీ భూటాన్‌ దేశానికి చెందిన డ్రక్‌ 1100 అనే బీర్లను కొనుగోలు చేసేవారు కరువవడంతో కాలం చెల్లాయి. దీంతో అధికారులు రెండు రోజుల క్రితం 1,070 కేసుల బీర్లను డిపో అధికారులు పారబోశారు.

దీంతో సుమారు రూ. 16 లక్షల 70 వేల నష్టం బీర్ల కంపెనీకి జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి కంపెనీ ద్వారా రావాల్సిన ఆదాయం రాకుండా పోయింది. వైన్స్‌ నిర్వాహకులు సదరు కంపెనీ బీర్లను కొనుగోలు చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఏడాదిగా డిపోలోనే నిల్వ ఉండడంతో కాలం చెల్లాయని అధికారులు తెలిపారు. బీర్ల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించగా ఏడాది క్రితమే కాల్లం చెల్లాయని రిపోర్టు రావడంతో పారబోశామని పేర్కొన్నారు. గతంలోనూ కాలంచెల్లిన మద్యాన్ని పారబోసినా, ఇంత భారీస్థాయిలో పారబోయడం ఇదే తొలిసారని డిపో అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు