ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌

15 Feb, 2017 01:02 IST|Sakshi
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌
- దూరవిద్య , రెగ్యులర్‌ బీఈడీ కోర్సులకు 
- అడ్‌హాక్‌ లెక్చరర్ల నియామకం  
- టైం స్కేలు ఉద్యోగులకు అద్దె భత్యం మంజూరు  
- పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు  
ఎస్కేయూ (అనంతపురం) : ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి ఎస్కేయూ పాలక మండలి ఆమోదం తెలిపింది. మంగళవారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం జరిగింది. తొలిసారిగా వర్సిటీలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు పాలకమండలి ఆమోదం తెలిపింది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఏజెన్సీని అప్పగించే వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకుంది. కార్తికేయ ఏజెన్సీకి అప్పగించే ముందే పలు ఆరోపణలు రావడంతో మాజీ ఉపకులపతులతో కమిటీ వేశారు. కార్తికేయ ఏజెన్సీపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కాలేదని నివేదిక ఆధారంగా పాలకమండలి తుది ఆమోదం తెలిపింది. కంప్యూటర్‌ ఆపరేటర్ల పోస్టుల భర్తీలో కార్తికేయ ఏజెన్సీ ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుననట్లు ప్రచారం జరగడంతో వాటి మినహా గార్డెనర్, స్క్రావెంజర్స్, డ్రైవర్స్‌ తదితర పోస్టులను భర్తీ చేసేందుకు పాలకమండలి సమ్మతించింది. త్వరలోనే కార్తికేయ ఏజెన్సీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. మరో వైపు సెక్యూరిటీ గార్డులకు సంబంధించిన వెంగమాంబ ఏజెన్సీ ఉద్యోగుల పీఎఫ్‌ సొమ్ము స్వాహా చేశారనే ఆరోపణలపై  ప్రొఫెసర్ల కమిటీ వేసి, నిగ్గుతేల్చాలని పాలకమండలి తీర్మానించింది.  
 
అడ్‌హాక్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి అనుమతి  :
దూరవిద్య బీఈడీ, రెగ్యులర్‌ బీఈడీ కోర్సుల్లో ఎన్సీటీఈ నిబంధనలకనుగుణంగా అడ్‌హాక్‌ లెక్చరర్లను నియమించాలనే ప్రతిపాదనకు అనుమతి లభించింది. ఏటా ఎ¯ŒSసీటీఈ అనుమతికి బోధన పోస్టుల భర్తీ లేకపోవడంతో అవరోధంగా ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టైం స్కేలు ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యం పెంపుదల చేశారు.   రెగ్యులర్‌ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు ఒక్కో విద్యార్థికి రూ. 65లు, సప్లిమెంటరీ పరీక్షలకు ఒక్కో విద్యార్థికి రూ.15లు అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలలకు చెల్లిస్తారు.
 
ఎన్నికల సంఘానికి అనుమతి :
ఎస్కేయూ రెక్టార్‌ ఆచార్య శ్రీధర్, రిజిస్ట్రార్‌ ఆచార్య వెంకటరమణ పదవీ కాలం జనవరి 3 నాటికి ముగిసింది. వచ్చే పాలకమండలి సమావేశం వరకు కొనసాగించా లని గత పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. అయితే  మంగâýæవారం జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున  ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని పదవుల మార్పు అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. పాలకమండలి సమా వేశానికి ఎస్కేయూ ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్‌ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ సుబ్రమణ్యం, ఆచార్య  ఎ. మల్లికార్జున రెడ్డి, ఆచార్య బి.ఫణీశ్వరరాజు, రామయ్య, డాక్టర్‌ ఎండ్లూరి ప్రభాకర్, విజయారావు, నాగజ్మోతిర్మయి, రెక్టార్‌ ఆచార్య జి.శ్రీధర్, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎ .వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.   
మరిన్ని వార్తలు