విజేత కృష్ణా జిల్లా

27 Jul, 2016 00:42 IST|Sakshi
edlu
 
వలేటివారిపాలెం: మండలంలోని శాఖవరం గ్రామంలో అంకమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీల్లో కృష్ణా జిల్లాకు చెందిన ఎడ్లు విజేతలుగా నిలిచాయి. ఉత్కంఠ భరితంగా సాగిన పోటీలో ఎనిమిది జతల ఎడ్లు పాల్గొన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన కాసరనేని పావనిచౌదరి ఎడ్లు 4500 అడుగులు బండను లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడపల్లి గ్రామానికి చెందిన మార్తాల చంద్రఓబులరెడ్డి ఎడ్లు 4157.6 అడుగులు దూరం బండను లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. అయితే  గుంటూరు జిల్లా గణపరం గ్రామానికి చెందిన నల్లూరి రాంబాబు ఎడ్లు, ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం రాళ్ళపాడు గ్రామానికి చెందిన మద్దిరాల రామారావు ఎడ్లు, ఖమ్మం జిల్లా కొప్పరావూరు గ్రామానికి చెందిన తోట శ్రీనివాసరావు ఎడ్లు 4000 అడుగుల దూరం బండ లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. కడప జిల్లా కాశినాయన మండలానికి చెందిన పోతిరెడ్డి సిద్దయ్య ఎడ్లు 3500 అడుగులు బండను లాగి నాలుగో స్థానంలో నిలిచాయి. నిర్వాహకులు ఆరు బహుమతులను  ప్రకటించినప్పటికి మూడు మూడు జతల ఎడ్లు తృతీయ స్థానంలో నిలవడంతో మూడు, నాలుగు, ఐదు బహుమతులను తృతీయ స్థానంలో నిలిచిన ఎడ్లకు సమానంగా పంచారు. రూ. 30వేలు, రూ. 20వేలు మెుదటి రెండు స్థానాలకు.. మూడవ స్థానంలో నిలిచిన ఎడ్లకు రూ. 15వేలు, రూ. 10వేలు, రూ. 5వేలనుS సమానంగా పంచారు. నాలుగో బహుతిగా రూ. 4 వేలు అందించారు. 
 
మరిన్ని వార్తలు