ఏటీఎం మోసానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు

25 Jun, 2016 14:22 IST|Sakshi
ఏటీఎం మోసానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు

ఏటీఎంలో జమ చేయాల్సిన రూ. 10లక్షలు కాజేసిన కస్టోడియన్స్

 ఆర్మూర్‌అర్బన్ : ఏటీఎంలలోని లొసుగులను ఆసరా చేసుకున్న ఇద్దరు కస్టోడియన్స్ రూ. 10 లక్షలను కాజేసిన సంఘటన ఆర్మూర్‌లో చోటు చేసుకుంది. వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో డబ్బులను జమ చేసే ఒక సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఈ మోసానికి పాల్పడ్డారు. ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌హెచ్‌వో సీతారాం వివరాలను వెల్లడించారు. నందిపేట్‌కు చెందిన చేపూర్ శ్రీకాంత్, మండలంలోని మంథనికి చెందిన గడ్డి లింబా ద్రి రైటర్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కస్టోడియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు.

వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంలలో డబ్బులను జమా చేయడం వీరి విధి. ఇందులో భాగంగా ఆర్మూర్‌లోని పిస మల్లన్న గుడి సమీపంలో గల రామ్‌నగర్ ఏటీఎంలో ఈనెల 7న రూ. 20 లక్షలు జమ చేయడానికి వచ్చారు. అనంతరం ఏటీఎంలో ఉన్న సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకున్న ఇరువురు రూ. 10 లక్షలను మాత్రమే జమా చేసి రూ. 20 లక్ష లు జమా చేసినట్లుగా అందులో అంకెలను నిక్షిప్తం చేశారు. కాజేసిన రూ. 10 లక్షల నుంచి చెరో ఐదు లక్షలను పంచుకున్నారు. మళ్లీ ఇదే నెల 13న ఏటీఎంకు వచ్చి అందులో రూ. 10 లక్షలు మాత్ర మే ఉన్నాయని కంపెనీ మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు.

ఏటీఎంకు చేరుకున్న మేనేజర్ రూ. 10 లక్షలు గల్లంతైన విషయాన్ని గమనించాడు. ఇదే విషయాన్ని ఈనెల 14న ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసు లు శుక్రవారం ఇద్దరిని ఏటీఎం వద్ద అ దుపులోకి తీసుకుని విచారించగా నేరా న్ని అంగీకరించారు. నిందితుల నుంచి రూ. 7 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. సమావేశం లో ఎస్సై సంతోష్ కుమార్, ఐడీ కానిస్టేబుళ్లు శ్రీను, రాములు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు