అలరించిన త్యాగయ్య భక్తి సంకీర్తనలు

3 Aug, 2016 01:22 IST|Sakshi
గాత్ర కచేరి నిర్వహిస్తున్న సంగీత విద్యాంసురాలు సౌమ్య బృందం
 
 తిరుపతి కల్చరల్‌: త్యాగరాజ సంగీతోత్సవాల్లో భాగంగా  ప్రముఖ సంగీత విద్వాంసురాలు, కళైమామణి సౌమ్య ఆలపించిన త్యాగయ్య భక్తి సంకీర్తనలు ప్రేక్షకులను అలరించాయి. త్యాగరాజ మండపంలో మంగళవారం  ‘త్యాగరాజు  ఒక రోజు దినచర్య’ అనే అంశంపై సంగీతాలాపన చేస్తూ  ఆయన రోజూ వారి భక్తి సంకీర్తనల గురించి వివరించారు.  త్యాగరాజస్వామి తన ఇంట్లో శ్రీరామ^è ంద్రమూర్తిని పూజించిన విధానం, శ్రీరాముని స్తుతించడానికి చేసిన కీర్తనలను వారు ఆలపించారు. మొదటగా త్యాగయ్య ఉత్సవ సంప్రదాయ కృతులతో  ఆయన దిన చర్యను వివరిస్తూ  సంకీర్తనలను గానం చేశారు.  ఇందులో భాగంగా ఉదయం మేల్కొపు నుంచి  పవళింపు సేవ వరకు సుమారు 20 కీర్తనలకుపైగా ఆలపించి ప్రేక్షకులను మైమరపించారు. అనంతరం   సౌమ్య బృందం నిర్వహించిన  గాత్ర కచేరి శ్రవనానందకరంగా సాగింది.  వీరికి వయోలిన్‌ౖపై  ఎంబార్‌ కణ్ణన్, మదంగంపై  నైనేలి నారాయణన్‌ చక్కటి సహకారం అందించి రక్తి కట్టించారు.  అనంతరం  త్యాగరాజ ఉత్సవ కమిటీ నిర్వాహకులు  సౌమ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో  ఉత్సవ కమిటీ నిర్వాహకులు దొరైరాజ్,  సుందరరామిరెడ్డి,  కత్తుల సుధాకర్,  ప్రభాకర్‌ పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు