విద్యుదాఘాతంతో మహిళ మృతి

26 Feb, 2017 00:00 IST|Sakshi

నార్పల : మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ రోడ్డులో ఉన్న ఐష్‌ ఫ్యాక్టరీ నిర్వాహకురాలు శ్యామల(39) విద్యుదాఘాతంతో మృతి చెందారు. వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురం మండలం బిదినంచెర్ల గ్రామానికి చెందిన శ్యామల కుటుంబం ఎనిమిదేళ్ల క్రితం నార్పలకు వలస వచ్చి జీవనోపాధికి ఐష్‌ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. శుక్రవారం శివర్రాతి కావడంతో ఆమె భర్త నారాయణరెడ్డి వైఎస్సార్‌ జిల్లా పెండ్లిమర్రి మండలంలోని పొలతల కొండకు వెళ్లారు.

ఆయన లేకపోవడంతో అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో శ్యామల ఐష్‌ ఫ్యాక్టరీలో ప్లగ్‌ వేయబోయి విద్యుదాఘాతానికి గురై అపస్మారకస్థితిలో పడిపోయారు. ఫ్యాక్టరీ వద్ద ఉన్నవారు అది గమనిఽంచి ఆమెను హూటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె చనిపోయినట్లు మృతిరాలి కుటుంబ సభ్యులు తెలిపారు. శ్యామల భర్త నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాంప్రసాద్‌ తెలిపారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు