కేసీఆర్ గారూ పొలాలకు వెళ్లారా?

18 Nov, 2015 14:20 IST|Sakshi
కేసీఆర్ గారూ పొలాలకు వెళ్లారా?

వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కొనసాగుతోంది. బుధవారం ఆయన గీసుకొండలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ...కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 20 లక్షల 60వేల ఎకరాల భూములు పంచారని... అధికారంలోకి వచ్చాక ఎంత భూమిని పంపిణి చేశారనే విషయాన్ని కేసీఆర్‌ ను గట్టిగా నిలదీయాలని సూచించారు. కేసీఆర్ అధికారం చేపట్టి 18 నెలలు అవుతోందని, ఈ కాలంలో ఆయన ప్రజలకు పంచింది కేవలం 16వందల ఎకరాలు మాత్రమేనని వైఎస్ జగన్ అన్నారు.

ఇక నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయారన్నారు. ఇక పత్తికి కనీస మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతన్న ఆరుగాలం శ్రమించి పత్తి పండిస్తే... ఇవాళ మార్కెట్‌లో కొనే నాధుడే లేరన్నారు. అది బాగోలేదు...ఇది బాగోలేదంటూ రైతుల వద్ద నుంచి పత్తిని కొనడం లేదని, ఈ విషయం కేసీఆర్‌కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు.

పత్తి పండించేందుకు రైతులు పడుతున్న కష్టాలు చూడాలని..., ఒకసారి పత్తి పొలాలకు వస్తే పరిస్థితి అర్థం అవుతుందన్నారు. ప్రస్తుతం పత్తి క్వింటాల్ కి 4,100 వస్తుందని, అదే రాజశేఖరరెడ్డి హయాంలో రూ.6,700 వరకూ వచ్చిన విషయాన్ని గుర్తించాలని అన్నారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ కు ఓటు వేసి, ఆయన్ని గెలిపించాలని వైఎస్ జగన్ కోరారు.

మరిన్ని వార్తలు