ఎలా బతికించుకునేదీ..!

13 Feb, 2018 12:00 IST|Sakshi
ముగ్గురు చిన్నారులకు ఒకే విధమైన రోగం సోకడంతో పిల్లలతో కలెక్టరేట్‌ ఆవరణలో కూర్చుని సాయం కోసం అర్థిస్తున్న భార్యాభర్తలు చిన్న, వెంకన్న

ముగ్గురి బిడ్డలకూ కాలేయ సమస్య

పుట్టుకతో అనారోగ్యం

లక్షల్లో వ్యయం ... ఆదుకోని ఆరోగ్యశ్రీ

బాధ చెప్పుకోడానికి మంత్రి కామినేని దగ్గరకు వెళ్తే వేళాకోళం

ఆ బాధ కన్నా ... మంత్రి వ్యాఖ్యలతో మనస్తాపం

దాతల సాయం కోసం ఎదురు చూపులు

తొలి ప్రసవంలోనే మగ బిడ్డ పుట్టడంతోఆ దంపతుల్లో సంతోషం పెల్లుబికింది...మలి ప్రసవంలో ఆడబిడ్డ...ఇక చాలనుకున్నారుసంసార బండి సాఫీగా సాగుతుందనుకున్నారుఅంతలోనే పిడుగులాంటి వార్త...
తొలిబిడ్డలో కాలేయం దెబ్బతిందని...ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండగానేమరో బిడ్డకూ అదే వ్యాధి...ఇద్దరు బిడ్డలకూ అనారోగ్యం వెంటాడడంతోమరో బిడ్డని కన్నారు ... ఆ బిడ్డకూ అదే జబ్బుకూలీ, నాలీ చేసిన డబ్బులతోముగ్గురినీ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నారు

లక్షల ఖర్చు... అక్కరకు రాని ఆరోగ్య శ్రీ...అంతలోనే ఆరోగ్య శాఖా మంత్రి రాకతోఎంతో ఆశతో ఆశ్రయించారు...అయన మాటలతో కుంగిపోయారు...సాయం మాటెలా ఉన్నా ...ఆయనేం మంత్రి...కడుపు పంటపైనే కడుపు మంటా దక్కే బిడ్డకోసం ముగుర్ని కంటేఇంత అపహాస్యమా...ఆదుకోవాలని అర్ధిస్తేఇంత అసహనమా...!

కాకినాడ రూరల్‌: మట్టిపనికి వెళ్తేనే అన్నం కుండ పొయ్యెక్కేది ... పూట గడిచేది. ఉన్నదాంట్లోనే గుట్టుగా బతికే కుటుంబంలో ఓ మాయదారి రోగం ఆ సంసారాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఏకంగా ముగ్గురు పిల్లలకూ ఒకే రకమైన జబ్బు సోకడంతో ఆ కన్నపేగుల్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. చివరకు జిల్లా అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతున్నా ప్రతిఫలం కనిపించడం లేదు. ఎవరైనా సాయం చేద్దామన్నా ఒకటి, రెండు వేలల్లో అయిపోయే జబ్బు కాదు. దీంతో సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో జరిగిన ప్రజావాణికి ముగ్గురు చిన్నారులను వెంటపెట్టుకొని ప్రాధేయపడిన ఘటన పలువురిని కలిచివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

సామర్లకోట ఇస్మాయిల్‌నగర్‌కు చెందిన అమర్తి చిన్న, వెంకన్నలు భార్యాభర్తలు. వీరికి దుర్గాప్రసాద్‌ (7), లక్ష్మి (4), మార్త (2) ముగ్గురు సంతానం. మొదటి కుమారుడు దుర్గాప్రసాద్‌ పుట్టిన మూడేళ్లకు ఒంట్లో బాగోలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాలేయ వ్యాధి సోకిందని, దీనికి దాదాపుగా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా డీలా పడిపోయారు. తరువాత మరో అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికీ అదే జబ్బుండడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఒకరుకాకపోతేమరొకరైనా బాగుంటారన్న ఆశతో మరో అమ్మాయికి జన్మనిచ్చిన ఆ తల్లికి మూడో బిడ్డ కు కూడా అదే వ్యాధి ఉందని తెలిసి కుప్పకూలిపోయారు. హైదరాబాద్, విశాఖపట్నం, సామర్లకోట, విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో తిరగని ఆసుపత్రి లేదు. ముగ్గురు పిల్లలకూ ఒకే రకమైన జబ్బు సోకడంతో ఆపరేషన్లు చేయించాలంటే సుమారు రూ. కోటి వ్యయమవుతుందని వైద్యులు చెబుతున్నారని ఆ తల్లిదండ్రులు వాపోయారు.

మంత్రి వ్యాఖ్యలతో...
ఈ రోగానికి ఆరోగ్యశ్రీ వర్తించదని తేల్చడంతో నాలుగు రోజుల కిందట కాకినాడ వ చ్చిన వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావును తమ పిల్లలతో వెళ్లి సమస్యను వివరించారు. దయ చూపించాల్సిన ఆ మంత్రి ‘తొలి బిడ్డకు జబ్బు ఉందని తెలి సి వరుసగా ఇద్దరు బిడ్డలను ఎందుకు కన్నావ’ని ఛీదరించుకున్నారని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. జబ్బు ఉంది ... ఏదో ఓ బిడ్డ బతికి వంశాన్ని నిలబెడతారని కన్నాం...  బాధను అర్ధం చేసుకోకుండా మంత్రి కామినేని అన్న మాటలకు అక్కడే బిడ్డలతో కలసి చనిపోవాలనిపించింద’ని ఆ తల్లి ‘సాక్షి’తో చెబుతూ బోరున విలపించింది. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను కలసి తమ సమస్యను వివరించినా ‘ఈ సమ స్య ఇక్కడ పరిష్కారం కాదని చెప్పా’రంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దాతలు ముందు కు వచ్చి తమ బిడ్డలను కాపాడా’లంటూ ఆ భార్యా, భర్తలు వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు