గ్రహం అనుగ్రహం, జులై 11, 2015

11 Jul, 2015 01:42 IST|Sakshi

శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం, తిథి బ.దశమి ప.10.58 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం భరణి ప.3.18 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం రా.2.50 నుంచి 4.23 వరకు, దుర్ముహూర్తం ఉ.5.34 నుంచి 7.20 వరకు, అమృతఘడియలు ఉ.10.44 నుంచి 12.14 వరకు

భవిష్యం
 
మేషం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులో కొస్తాయి. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది.

వృషభం: మిత్రులతో అకారణంగా వైరం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. దూర ప్రయాణాలు. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

మిథునం: ఉద్యోగ యత్నాలు సానుకూలం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆహ్వానాలందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు అందుతాయి.

సింహం: రుణ యత్నాలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధువులతో విభేదాలు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: దూరపు బంధువులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: పనులు చకచకా సాగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

 ధనుస్సు:  పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

 మకరం: రుణ ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవాంతరాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలలో మార్పులు ఉంటాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

 కుంభం: కుటుంబసమస్యలు తీరతాయి. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వస్తు లాభాలు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి.

 మీనం: వ్యయప్రయాసలు. ధన వ్యయం. శ్రమాధిక్యం. బంధువర్గంతో వివాదాలు రావచ్చు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. పనుల్లో జాప్యం జరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

 - సింహంభట్ల సుబ్బారావు
 
 

మరిన్ని వార్తలు