శ్రీ శోభకృత్నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: శు.నవమి రా.12.52 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: శతభిషం రా.8.34 వరకు, తదుపరి పూర్వాభాద్ర,వర్జ్యం: రా.2.32 నుండి 4.02 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.23 నుండి 9.11 వరకు, తదుపరి రా.10.30 నుండి 11.18 వరకు,అమృతఘడియలు: ప.1.55 నుండి 3.22 వరకు, యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు, రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం : 6.10, సూర్యాస్తమయం : 5.21.
మేషం... వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు.
వృషభం... ఆకస్మిక ధనలబ్ధి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. ముఖ్య నిర్ణయాలు. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.
మిథునం... వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. బంధువులను కలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పనుల్లో అవరోధాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.
కర్కాటకం... ముఖ్యమైన పనులు వాయిదా. అనుకోని ప్రయాణాలు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. అనారోగ్యం. శ్రమ తప్పకపోవచ్చు.
సింహం.... పనులు విజయవంతంగా పూర్తి. అందరిలోనూ గుర్తింపు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. విందువినోదాలు.
కన్య... వ్యూహాలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయోగం. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
తుల... ప్రయాణాలు వాయిదా. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. ఇంటాబయటా చికాకులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.
వృశ్చికం... కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయాల దర్శనాలు. అనారోగ్యం. విద్యార్థులకు కొంత నిరాశ.
ధనుస్సు... మీ సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మకరం... దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు వాయిదా.
కుంభం... వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆహ్వానాలు అందుతాయి.
మీనం.... వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబసభ్యలతో విభేదాలు. పుణ్యక్షేత్రాల సందర్శనం. భూవివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.