ఎంసెట్.. తుది దశ సన్నాహాలు..

5 Feb, 2015 11:05 IST|Sakshi
ఎంసెట్.. తుది దశ సన్నాహాలు..

ఇంటర్మీడియెట్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ‘పరీక్షా కాలం’ దగ్గరకొస్తోంది! ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫిబ్రవరి 12 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 9న తెలంగాణలో, మార్చి 11న ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటిలో మంచి మార్కులు సాధించేందుకు ప్రయత్నిస్తూనే, ఇంజనీరింగ్‌లో సీటు సాధించేందుకు వీలుకల్పించే ఎంసెట్‌లో ఉన్నత ర్యాంకు కోసం కృషి చేయడం ప్రధానం. ఈ క్రమంలో ఇప్పటి నుంచి ఎంసెట్‌కు ప్రిపరేషన్ ఎలా ఉండాలనే దానిపై స్పెషల్ ఫోకస్..
 
 ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇప్పటి నుంచి పూర్తిగా ఇంటర్ సబ్జెక్టుల ప్రిపరేషన్‌పై దృష్టిసారించాలి. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి.  ప్రతి సబ్జెక్టుకు సంబంధించి తెలుగు అకాడెమీలోని అన్ని ప్రశ్నల సమాధానాలు చదవాలి. తొలుత గత రెండేళ్ల పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను పూర్తిచేయాలి.
కాలేజీలో జరిగే ప్రి ఫైనల్ పరీక్షల్ని తప్పనిసరిగా రాయాలి. తప్పులు ఎక్కడ దొర్లుతున్నాయో చూసుకొని, మరో ప్రి ఫైనల్‌లో అలాంటివి జరక్కుండా జాగ్రత్తపడి వంద శాతం మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి.
 ఇంటర్ పబ్లిక్ పరీక్షల తర్వాత ఎంసెట్‌కు దాదాపు 45 రోజులు సమయం అందుబాటులో ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో లేదంటే టాప్-20 ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించడమే లక్ష్యంగా ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి.
ప్రభుత్వ, విశ్వవిద్యాలయాల ఇంజనీరింగ్ కాలేజీల్లో రెండు రాష్ట్రాల్లో సుమారు ఆరువేల సీట్లు ఉన్నాయి. వీటిలో సీటును ఖాయం చేసుకోవాలంటే 100-120 మార్కులు తెచ్చుకోవాలి.
 జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించాలనే లక్ష్యం ఉన్నవారు ఇప్పటి నుంచి ఫిబ్రవరి 28 వరకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లోని కాన్సెప్టులపై పూర్తిస్థాయిలో పట్టుసాధించాలి. దీంతోపాటు ఆయా చాప్టర్లలోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలను మరోసారి సాధించాలి ప్రీ ఫైనల్ రాస్తూ కూడా ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్‌పై దృష్టిసారిస్తే ఇంటర్ పరీక్షల తర్వాత పది రోజుల్లో జరిగే జేఈఈ మెయిన్‌లో మంచి ర్యాంకు సంపాదించవచ్చు.
 
 మ్యాథమెటిక్స్
 ఎంసెట్‌లో 160 మార్కులకు 80 మార్కులు మ్యాథమెటిక్స్‌కు ఉంటాయి. కచ్చితత్వం, వేగంతో కూడిన సమస్యల సాధన మంచి ర్యాంకు సాధనకు వీలుకల్పిస్తుంది. ఇంటిగ్రల్ కాలిక్యులస్, త్రీడీ జామెట్రీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, వెక్టార్ ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మెంట్స్, సర్కిల్స్ చాప్టర్లపై ఎక్కువ దృష్టిసారించాలి. ఈ చాప్టర్ల నుంచి ఎంసెట్‌లో అధిక ప్రశ్నలు వస్తాయి.
 ద్విపద సిద్ధాంతం, మ్యాథమెటికల్ ఇండక్షన్ సమస్యను సాధించేటప్పుడు లాజిక్స్, మినహాయింపులను గుర్తుంచుకోవడం ద్వారా సులువుగా సమాధానాన్ని రాబట్టవచ్చు.
 ట్రెగనోమెట్రీలో ప్రత్యేకంగా రాసుకొని, ప్రాక్టీస్ చేయాలి. కోఆర్డినేట్ జామెట్రీలో చాలా సమస్యలకు సమాధానాలను ఆప్షన్ల నుంచి రాబట్టవచ్చు. అందువల్ల వీటిని ప్రాక్టీస్ చేయాలి.
     ఫంక్షన్స్‌లో డొమైన్, రేంజ్; వెక్టార్ ఆల్జీబ్రాలో వజ్ర, బిందు లబ్ధం; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌లో మూలాల సంబంధాలు; మ్యాట్రిసెస్‌లో నిర్ధారక ధర్మాలు, మాత్రికా ధర్మాలు; స్టాటిస్టిక్స్‌లో క్రమవిచలనం, విస్తృతి; సర్కిల్స్‌లో స్పర్శరేఖలు; 3డీ జ్యామితిలో బిందువులు, తలాలు అంశాలు ముఖ్యమైనవి.
 
 ఎంసెట్ 2013, 14 - వివిధ చాప్టర్ల వెయిటేజీ
 చాప్టర్    ప్రశ్నలు
 ఆల్జీబ్రా (బీజ గణితం)    26
 కాలిక్యులస్ (కలనగణితం)    19
 జామెట్రీ (రేఖాగణితం)    17
 ట్రిగనోమెట్రీ (త్రికోణమితి)    9
 వెక్టార్ ఆల్జీబ్రా (సదిశా బీజగణితం)    6
 3డీ-జ్యామితి    3
 
 ఫిజిక్స్
     ఎంసెట్ పరంగా ఫిజిక్స్ విభాగం క్లిష్టమైనది. దీనికి 40 మార్కులు కేటాయించారు. కాన్సెప్టులపై ఎంతమేరకు పట్టు సాధించామనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది.
     సూత్రాలను తెలుసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన సమస్యలను సాధించడం ప్రధానం. ఒక సమస్యను రెండు, మూడు పద్ధతుల్లో సాధించడాన్ని ప్రాక్టీస్ చేయాలి.
     ఎక్కువ నమూనా పరీక్షలు రాయడం ద్వారా వేగాన్ని అలవరచుకోవాలి. స్వీయ విశ్లేషణతో పట్టు సాధించాలి.
     ఎలక్ట్రో మ్యాగ్నటిజం, వేవ్ మోషన్, హీట్, మ్యాగ్నటిజం అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి.
     న్యూక్లియర్ ఫిజిక్స్, అటామిక్ ఫిజిక్స్, సెమీకండక్టర్ డివెసైస్ అంశాలు ముఖ్యమైనవి. ఇవి సులువైన అంశాలు కూడా.
     మెకానిక్స్ నుంచి 30 శాతం, హీట్ నుంచి 10 శాతం, సౌండ్ అండ్ వేవ్ మోషన్ నుంచి 5 శాతం, ఎలక్ట్రిసిటీ నుంచి 15 శాతం, మ్యాగ్నటిజం నుంచి 13 శాతం, మోడర్న్ ఫిజిక్స్ నుంచి 10 శాతం ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
 ఎంసెట్-2014లో చాప్టర్ల వారీగా ప్రశ్నలు
 మొదటి ఏడాది
 అంశం    ప్రశ్నలు
 యూనిట్స్ అండ్ డైమన్షన్స్    1
 వెక్టార్స్    1
 కైనమాటిక్స్    2
 డైనమిక్స్    2
 కొలిజన్స్, సెంటర్ ఆఫ్ మాస్    2
 ఫ్రిక్షన్    1
 రొటేటరీ మోషన్    2
 గ్రావిటేషన్    1
 సరళహరాత్మక చలనం    1
 ఎలాస్టిసిటీ    1
 సర్ఫేస్ టెన్షన్    1
 ఫ్లూయిడ్ డైనమిక్స్    1
 హీట్    4
 ద్వితీయ సంవత్సరం
 వేవ్ మోషన్    2
 రే ఆప్టిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్    3
 మ్యాగ్నటిజం    2
 ఎలక్ట్రో స్టాటిక్స్    2
 కరెంట్ ఎలక్ట్రిసిటీ    2
 ఎలక్ట్రో మ్యాగ్నటిజం    2
 న్యూక్లియర్ ఫిజిక్స్    2
 సెమీ కండక్టర్స్, న్యూక్లియర్ ఫిజిక్స్    4
 కమ్యూనికేషన్ సిస్టమ్స్    1
 
 కెమిస్ట్రీ
     ఫిజిక్స్ మాదిరిగానే ఎంసెట్‌లో కెమిస్ట్రీకి 40 మార్కులు కేటాయించారు. ఈ సబ్జెక్టును చదివేటప్పుడు ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్ చేసుకోవాలి. వీటిని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని ఈక్వేషన్స్‌ను పదేపదే రాయడం ద్వారా పట్టు సాధించవచ్చు.
     సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్ కష్టమైనవిగా భావిస్తారు కానీ అవి చాలా ముఖ్యమైనవి.
     ఫిజికల్ కెమిస్ట్రీలోని సమస్య సాధనలు తప్ప మిగిలిన కెమిస్ట్రీలోని అన్నింటికీ ఇంటర్ ప్రిపరేషన్, ఎంసెట్ ప్రిపరేషన్‌కు పెద్దగా తేడా ఉండదు.
     ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధించడంలో కెమిస్ట్రీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సబ్జెక్టులో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.
     ఇందులోని 70 శాతం నుంచి 80 శాతం ప్రశ్నలను తేలి గ్గా సాధించవచ్చు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండ్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి.
     ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని రసాయనిక సమ్మేళనాల ధర్మాలు, తయారీ పద్ధతులు నేర్చుకోవాలి. ఆల్కహాల్స్, ఫినాల్స్, అమైన్స్‌లోని నేమ్డ్ రియాక్షన్స్; ఆర్డర్ ఆఫ్ యాసిడ్, బేసిస్ స్ట్రెంథ్‌లను బాగా గుర్తుంచుకోవాలి. ఇంటర్ కన్వర్షన్స్‌ను నేర్చుకోవాలి.
     ఫిజికల్ కెమిస్ట్రీలోని సూత్రాలన్నింటినీ నేర్చుకొని, వాటి ఆధారిత సమస్యలను సాధించాలి.
     ఎంసెట్‌లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 12-16 ప్రశ్నలు వస్తాయి. మిగిలిన విభాగాలతో పోల్చితే ఇది కొంత క్లిష్టమైన విభాగం. ఇందులోని మూలకాల ధర్మాలను ఒకదాంతో మరోదాన్ని పోల్చుకుంటూ అధ్యయనం చేయాలి. అన్ని గ్రూప్స్‌లో మూలకాల ధర్మాలు చాలా వరకూ ఒకేలా ఉంటాయి. వాటి భిన్న ధర్మాలపై పట్టు సాధించాలి. పట్టిక రూపంలో రాసుకొని, పునశ్చరణ చేయడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి.
     గత ఎంసెట్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 10, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 11, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 16, సమ్మిళిత భావనలు (కజ్ఠ్ఛీఛీ ఇౌఛ్ఛిఞ్టట) నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి.
 
 ఎంసెట్ 2014 వెయిటేజీ
 మొదటి సంవత్సరం
 అంశం    ప్రశ్నలు
 అటామిక్ స్ట్రక్చర్    2
 పీరియాడిక్ టేబుల్    1
 కెమికల్ బాండింగ్    2
 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్    1
 స్టాకియోమెట్రీ    1
 థర్మోడైనమిక్స్    1
 కెమికల్ ఈక్విలిబ్రియం,
 యాసిడ్‌‌స అండ్ బేసెస్    2
 హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్    1
 ఆల్కలి, ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్    2
 గ్రూప్ 13 ఎలిమెంట్స్    1
 గ్రూప్ 14 ఎలిమెంట్స్    1
 ఎన్విరాన్‌మెంటల్ కెమిస్ట్రీ    1
 ఆర్గానిక్ బేసిక్స్, హైడ్రోకార్బన్స్    4
 
 ద్వితీయ సంవత్సరం
 అంశం    ప్రశ్నలు
 సొల్యూషన్స్    2
 సాలిడ్ స్టేట్    1
 ఎలక్ట్రో కెమిస్ట్రీ    2
 కెమికల్ కెనైటిక్స్    1
 మెటలర్జీ    1
 గ్రూప్ 15 ఎలిమెంట్స్    1
 గ్రూప్ 16 ఎలిమెంట్స్    1
 గ్రూప్ 17 ఎలిమెంట్స్    1
 డి-బ్లాక్ ఎలిమెంట్స్    1
 నోబెల్ గ్యాసెస్    1
 పాలిమర్స్    1
 రోజువారీ జీవితంలో కెమిస్ట్రీ    1
 ఆర్గానిక్ కాంపౌండ్స్    4
 సర్ఫేస్ కెమిస్ట్రీ    1

- ఎం. ఎన్. రావు,
శ్రీ చైతన్య విద్యా సంస్థలు

మరిన్ని వార్తలు