ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంక్‌?

30 Dec, 2016 04:01 IST|Sakshi
ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంక్‌?

బియ్యాన్ని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం?
– పశ్చిమ బెంగాల్‌

దేశంలో పంటలకు మద్దతు ధరలను రూపొందించేది?     – వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌

స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ను మంజూరు చేసేది?
– ఐఎంఎఫ్‌ (M)

భారత్‌లో మొదటి రైలు ప్రయాణం ప్రారంభమైన ప్రాంతం?    – ముంబై నుంచి థానే వరకు

ఏ రేటు వద్ద ఎగుమతులకు బదులు దిగుమతులు ప్రత్యామ్నాయమవుతాయో వాటిని ఏమంటారు?                                               – వర్తక నిబంధనలు

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌)లో అధిక కోటా గల దేశం?         – అమెరికా

అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?     – ఎడ్విన్‌ కానన్‌

జనాభా స్థిరీకరణను ఏ సంవత్సరం నాటికి సాధించాలని జనాభా విధానం–2000 లక్ష్యంగా పేర్కొంది?         – 2045

భారత్‌లోని నిరుద్యోగాన్ని ఏమని వర్ణించొచ్చు?
– నిర్మాణాత్మక నిరుద్యోగం

కర్జన్‌ బహుళార్థక సాధక నీటి ప్రాజెక్ట్‌ ఏ రాష్ట్రంలో ఉంది?         – గుజరాత్‌

ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?         – జెనీవా

భారతీయ యాజమాన్యంలో 1881లో ఆగ్రాలో స్థాపించిన బ్యాంక్‌?    – ఔ«ద్‌ కమర్షియల్‌ బ్యాంక్‌


ప్రపంచం మొదటి కేంద్ర బ్యాంక్‌?– రిక్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్వీడన్‌


హరిత విప్లవం ఏ రాష్ట్రాల్లో ప్రధానంగా చోటు
చేసుకుంది? – పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌


2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎంత శాతం కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం ఉంది?    – 30.7 శాతం

2011 సెన్సెస్‌కు సంబంధించి సెన్సెస్‌ కమిషనర్‌?
 సి. చంద్రమౌళి

మానవాభివృద్ధి సూచీని జిల్లాల వారీగా రూపొందించిన మొదటి రాష్ట్రం?        – మధ్యప్రదేశ్‌

బ్రిటిష్‌ పాలనలో భారత్‌లో జాతీయాదాయ వృద్ధి రేటు?        – 1.2 శాతం

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంత శాతం కుటుంబాలకు విద్యుత్‌ సౌకర్యం ఉంది?     – 55.3 శాతం
అల్ప ఉద్యోగిత అంటే?
– తన సామర్థ్యం కంటే తక్కువ

స్థాయి పని చేస్తుండటం
ఖాయిలా పడిన పరిశ్రమల చట్టాన్ని ఏ కమిటీ సూచన మేరకు రూపొందించారు?
– తివారి కమిటీ    
పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం?       – 1996 ఆగస్టు
చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి రిజర్వేషన్‌ విధానాన్ని ఉపసంహరించుకోవాలని సిఫార్సు చేసిన కమిటీ?         – అబిద్‌ హుస్సేన్‌
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించిన తేది?         – 2005, సెప్టెంబర్‌ 5
భారత ఆర్థిక రాజ్యాంగంగా పిలిచే పారిశ్రామిక తీర్మానం?     – 1956 పారిశ్రామిక తీర్మానం
జిల్లా పారిశ్రామిక కేంద్రాలను ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు?     – 1977
దేశంలో పరపతిని సృష్టించేవి?    – వాణిజ్య బ్యాంకులు
ప్రపంచంలో మొదటగా హరిత విప్లవం ఏ దేశంలో వచ్చింది?     – మెక్సికో
ఆక్ట్రాయ్‌ పన్నును విధించేది?     – స్థానిక సంస్థలు
పన్నుల సంస్కరణలపై 2002లో ఏర్పాటైన
టాస్క్‌ఫోర్స్‌ అధ్యక్షుడు?        – విజయ్‌ కేల్కర్‌
భూతలింగం కమిటీ దేనికి సంబంధించింది?
– పన్నుల ఎగవేత
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను ఎప్పట్నుంచి ప్రారంభించారు?         – 2005, ఏప్రిల్‌ 12
షెడ్యూల్డ్‌ బ్యాంక్‌ అంటే?    – 1934 ఆర్‌బీఐ చట్టంలోని షెడ్యూల్‌–2లో నమోదైన బ్యాంకులు
వ్యవసాయ ఆదాయంపై పన్నును సిఫార్సు చేసిన కమిటీ?         – కె.ఎన్‌. రాజ్‌
ఉఇఈ దేశాల ప్రధాన కేంద్రం?    – పారిస్‌
జీడీపీ, జీఎన్‌పీ భావనలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఆర్థిక శాస్త్రవేత్త?     – సైమన్‌ కుజ్‌నిట్స్‌
గినీ సూచీ ద్వారా దేన్ని అంచనా వేయొచ్చు?
– సాపేక్ష పేదరికం
ప్రభుత్వ వ్యయ సంస్కరణలకు సంబంధించి ఏర్పాటైన కమిటీ?        – గీతాకృష్ణన్‌
భారత్‌లో ఒక రూపాయి.. ప్రామాణిక ద్రవ్యంగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?    – 1835
భారత్‌లోని నిరుద్యోగ స్వభావం?    – దీర్ఘకాలికం
మన దేశంలో పేదరికాన్ని అంచనా వేయడంలో విశేష కృషి చేసినవారు?  – దండేకర్, రథ్‌
దేశంలో సిమెంట్‌ ఉత్పత్తి మొదటగా ఎక్కడ ప్రారంభమైంది?        – మద్రాస్‌తమ్మా కోటిరెడ్డి
ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్‌

>
మరిన్ని వార్తలు