ఈ తాబేలు వయసు ఎంతో చెప్పగలరా? డైనోసర్‌ని చూసొండొచ్చా?

5 Dec, 2023 16:30 IST|Sakshi

భూమ్మీద అత్యంత పురాతన కాలం నాటి జంతువులు ఇప్పటికీ ఇంకా బతికే ఉన్నాయంటే నమ్ముతారా?. నో ఛాన్స్‌ అంతరించిపోయే ఉంటాయని కచ్చితంగా చెబుతాం. అది అబద్ధం... నేనింకా బతికే ఉన్నానంటోంది ఈ తాబేలు. దీని వయసెంతో వింటే కచ్చితంగా షాకవ్వుతారు. ఎందుకంటే ఇది డైనసర్‌ల కాలం నుంచి ఉంది. ఒకరకరంగా చెప్పాలంటే జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల కాలం నుంచి ఉన్న జీవిగా ఈ తాబేలుని పేర్కొనవచ్చు. ఆ తాబేలు ఎక్కడ ఉంది? దానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం!

ఈ తాబేలు పేరు జోనాథన్‌. ఇది బ్రిటన్‌లోని సెయింట్‌ హెలెనాలో ఉంది. ఆ ద్వీపానికి చేరుకునేటప్పటికే ఈ తాబేలు వయసు 50 ఏళ్లు. అప్పటికే పూర్తిగి పరిణితి చెంది ఉంది. అందువల్ల ఇది సుమారు 1832లో జన్మించాడని చెబుతుంటారు దీని సంరక్షకులు. లేదా అంతకంటే పెద్దవాడైనా అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పడది తన 191వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఇప్పుడూ దీన్నే చూస్తే పురాతన కాలం నాటి కొన్ని జీవులు ఇంకా బతికే ఉన్నాయని ఒప్పుకుంటారు కదూ.

అయితే తాబేలు జీవిత కాలం 60 నుంచి 150 ఏళ్లు. ఐతే కొన్ని మాత్రం 200 ఏళ్ల వరకు జీవిస్తాయని చాలా మంది చెబుతుంటారు. బహుశా ఈ జోనాథన్‌ తాబేలు కూడా ఆ కోవకు చెందిందేనేమో!. అయితే అలాంటి తాబేలు భారత్‌లోని కొలకతాలో కూడా ఉందట. దాని పేరు అద్వైత. ఇది ఏకంగా 255 ఏళ్లు జీవించినట్లు చెబుతున్నారు.

తాబేలుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు

  • శిరచ్ఛేదం చేసిన తాబేలు చనిపోదట. తల నరికిన 23 రోజుల వరకు బతికిన సందర్భాలు కూడా ఉన్నాయట.
  • చైనా వాళ్లు దీన్ని దీర్ఘాయువుకి చిహ్నంగా భావిస్తారట.
  • అంతేగాదు తాబేలు మెదడును శస్త్రచికిత్స ద్వారా తొలగించిన మరణించదట. పైగా మెదడును తొలగించిన ఆరు నెలల వరకు కూడా బతికే ఉంటుందట

(చదవండి:  దెయ్యాలకు బోజనం పెట్టే పండుగ గురించి విన్నారా?)

>
మరిన్ని వార్తలు