మేడిన్ ఫారిన్

30 Jul, 2014 01:32 IST|Sakshi
మేడిన్ ఫారిన్

తోటకూర, పాలకూర, వంకాయులు, బెండకాయులు, బీరకాయులో.. వున వీధుల్లో వినిపిస్తూనే ఉంటారుు. తోపుడు బళ్ల మీద వచ్చిన కాయుగూరలు లోకలా, హైబ్రీడా అని అడిగి వురీ కొంటాం. హైబ్రీడ్ కూరగాయలు రుచి ఉండవని దేశవాళీకే మొగ్గు చూపిస్తాం. తాజాగా విదేశీ కూరగాయులు వీధుల్లోకి వచ్చి చేరాయి థాయ్ మిర్చి తింటే కారం నషాలానికి ఎక్కుతుంది. లెవున్ గ్రాస్ టేస్ట్ చేస్తే వున నివ్ముకాయు రుచిని వురిపిస్తుంది. ఇవే కాదు రంగు రంగుల క్యాప్సికమ్, క్యాబేజీ రకరకాల వెరైటీ వెజిటబుల్స్ విదేశాల నుంచి లోకల్ వూర్కెట్లోకి వచ్చి చేరుతున్నారుు.
 
 ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లే కాదు కూరగాయుల్లో కూడా ఫారిన్ సరుకు దేశంలోకి వచ్చేస్తోంది. థాయ్‌లాండ్, చైనా, వులేసియూ తదితర దేశాల నుంచి దిగువుతైన కూరగాయలు సిటీవాసులకు కొత్త రుచులు చూపిస్తున్నారుు. దాదాపు 70 రకాల విదేశీ కూరగాయులు హైదరాబాద్‌లో దొరుకుతున్నాయి.

ఆస్పరగస్, అవకొడో, బ్రొకొలీ, క్యాప్సికమ్ రెడ్ అండ్ ఎల్లో, సెలేరీ, చెర్రీ టమాటా, చైనీస్ పాక్‌చాయ్, చైనీస్ క్యాబేజీ, గలంగల్, లెమన్ గ్రాస్, థాయ్ బ్రింజాల్, లేట్యూస్ లీఫ్, జుకినీ వంటి వెరైటీలు సూపర్ వూర్కెట్లు, బడా వెజ్ వూర్కెట్లలో అందుబాటులో ఉంటున్నారుు. ఇవే కాకుండా పిజ్జా, సాండ్ విచ్‌లో ఉపయోగించే బేజిల్, ఆర్గెనో, చిల్లీ ఫ్లేక్స్, రోజ్ మేరీలు విదేశాల నుంచే ఇంపోర్ట్ అవుతున్నారుు.
 
  దిగువుతి ఇలా..
 విదే శాల నుంచి కూరగాయుల దిగువుతికి ఆన్‌లైన్, ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. ఆయూ దేశాల నుంచి ఆకాశవూర్గంలో నేరుగా నగరానికి వచ్చి చేరుతున్నారుు. థాయ్‌లాండ్‌తో పాటు ఊటీ, పుణే, బెంగళూరు, న్యూఢిల్లీ నుంచి కూడా విదేశీ కూరగాయలు దిగుమతి అవుతున్నారుు. థాయ్ నుంచి కూరగాయులు ఆర్డర్ చేసిన వుూడు రోజుల్లో నగరానికి చేరుకుంటున్నారుు. ఈ విదేశీ వెజిటేబుల్స్‌కి ఇక్కడి సూపర్‌వూర్కెట్లలో  వుంచి డివూండే ఉంది. కాంటినెంటల్, థాయ్, చైనీస్ వంటకాల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంటోంది.
 - బొప్పిడి మాధవరెడ్డి
 
 డిమాండ్ బాగానే ఉంది
 నాలుగు నెలలుగా మేం విదేశీ కూరగాయులు విక్రరుుస్తున్నాం. డివూండ్ బాగానే ఉంది.  సికింద్రాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు వివిధ స్టార్ హోటళ్లు, సూపర్ మార్కెట్లు, పిజ్జా సెంటర్లకు విదేశీ కూరగాయులు సప్లయ్ చేస్తు న్నాం. బల్క్ ఆర్డర్ ఉంటే హోం డెలివరీ సౌకర్యం ఉంది. వీటి ధరలు అందుబాటులోనే ఉంటారుు.
  - బాలకృష్ణ, తర్కారీ స్టోర్ యజమాని
 ఫొటోలు: రాజేష్‌రెడ్డి

>
మరిన్ని వార్తలు