మార్కెటింగ్ రెజ్యూమె రాయడమెలా?

7 Sep, 2014 03:18 IST|Sakshi
మార్కెటింగ్ రెజ్యూమె రాయడమెలా?

‘వన్ సైజ్ ఫిట్స్ ఆల్’.. మనలో చాలామంది నమ్మే సిద్ధాంత మిది. ఒకటే అన్నింటికీ పనికొస్తుందనుకోవడం పొరపాటు. రెజ్యూమె విషయంలో ఇది ఏమాత్రం వర్తించదు. ఒక్కో రంగాన్ని, ఉద్యోగాన్ని బట్టి రెజ్యూమె కూడా వేర్వేరుగా ఉంటుంది. ఒకదాని కోసం రూపొందించుకున్న రెజ్యూమెను మరో ఉద్యోగం కోసం పంపిస్తే ఫలితం ఉండదు. సాధారణంగా అభ్యర్థులు చేసే తప్పిదం ఏమిటంటే.. ఒక కామన్ ఫార్మాట్‌లో రెజ్యూమెను తయారు చేసుకొని, దాన్నే అన్ని కంపెనీలకు, అన్ని రకాల ఉద్యోగాలకు పంపిస్తుంటారు. కంపెనీల నుంచి పిలుపు రాక నిరాశ చెందుతుంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు రెజ్యూమె ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ఇది అభ్యర్థిపై యాజమాన్యానికి తొలి ప్రభావాన్ని కలిగిస్తుంది. అది సానుకూలమా? ప్రతికూలమా?.. ఎలాంటి ప్రభావమనేది రెజ్యూమెపై ఆధారపడి ఉంటుంది. నచ్చిన కొలువులో ప్రవేశించడానికి ఇది ఒక టికెట్ లాంటిది. ప్రస్తుతం మార్కెటింగ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఎలాంటి రెజ్యూమెను రూపొందించుకోవాలో తెలుసుకుందాం..
 
జాబ్ ఆబ్జెక్టివ్: సంస్థలో ఎలాంటి ఉద్యోగాన్ని కోరుకుంటున్నారో ఒకటి రెండు వాక్యాల్లో తేలిగ్గా అర్థమయ్యేలా వివరించాలి. దీన్నే జాబ్ ఆబ్జెక్టివ్ అంటారు. రెజ్యూమెకు ఇది స్పాట్‌లైట్ లాంటిది. నా మార్కెటింగ్ స్కిల్స్‌ను పెంచుకోవడానికి అవసరమైన ఉద్యోగం కావాలి అని రాయకుండా మార్కెటింగ్ రంగంలో నాకు ఒక స్థానాన్ని కల్పించే, సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి నా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు వీలైన పోస్టు కావాలి అంటూ అభ్యర్థించాలి. కంపెనీ నుంచి మీరు ఆశించేదాన్ని కాదు, కంపెనీకి మీరు ఇచ్చేదాన్నే రెజ్యూమెలో ప్రస్తావించాలి. సంస్థలో ఉత్పత్తిని, తద్వారా లాభాలను పెంచడానికి నా అనుభవాన్ని, స్కిల్స్‌ను ఉపయోగించేందుకు పోస్టు కావాలి అని పేర్కొనాలి. మార్కెటింగ్ డెరైక్టర్, ప్రొడక్ట్ మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాన్ని కోరుకుంటున్నట్లు నేరుగా తెలియజేయాలి. రెజ్యూమె రైటింగ్‌లో ఇప్పుడు ఇదే ఆధునిక ధోరణి. పోస్టు గురించి ప్రస్తావిస్తే మీలో సీరియస్‌నెస్ ఉందని సంస్థ యాజమాన్యం భావిస్తుంది.
 
పని అనుభవం: మార్కెటింగ్ రెజ్యూమెలో ఉండాల్సిన ప్రధాన అంశం.. పని అనుభవం. గతంలో ఏదైనా సంస్థలో పనిచేసి ఉంటే అక్కడ మీ హోదా, నిర్వర్తించిన బాధ్యతలను, సాధించిన విజయాలను రెజ్యూమెలో తప్పనిసరిగా రాయాలి. వీలును బట్టి అంకెలు, సంఖ్యలను కూడా ప్రస్తావించాలి. ఇలాంటి రెజ్యూమెకు విలువ అధికంగా ఉంటుంది. చాలా సంస్థలు రెజ్యూమెలను డేటా బేస్‌లో భద్రపరుస్తుంటాయి. మొత్తం రెజ్యూమెను చదవకుండా సెర్చ్‌లో కొన్ని కీ వర్డ్స్‌ను ఉపయోగించి అందులో తమకు అవసరమైన అంశాన్ని చదువుతుం టాయి. ఈ పదాలు సాధారణంగా మార్కెటింగ్‌కు సంబంధించినవే ఉంటాయి. కాబట్టి బిజినెస్ డెవలప్‌మెంట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ కమ్యూని కేషన్, మార్కెట్ రీసెర్చ్, పీఆర్ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వంటి పదాలు రెజ్యూమెలో ఉండేలా జాగ్రత్తపడండి. అంతేకాకుండా యాక్సిలరేటెడ్, అడ్మినిస్టర్డ్, కన్వర్టెడ్, ఎక్స్‌పాండెడ్, జనరేటెడ్, ఇంక్రీజ్‌డ్, ట్రెయిన్డ్, ఇనిషియేటెడ్ వంటి పదాలను ఉపయోగిస్తూ వాక్యాలను ప్రారంభించండి.
 

>
మరిన్ని వార్తలు