విద్యుత్ టారిఫ్ - జగన్ మోహన్ రెడ్డి హామీ!

3 Apr, 2014 12:13 IST|Sakshi
విద్యుత్ టారిఫ్ - జగన్ మోహన్ రెడ్డి హామీ!

కరెంట్. వైర్ పట్టుకుంటేనే షాక్ కొట్టడం కాదు.. ఇప్పుడు బిల్లు చూస్తేనే షాక్ కొట్టేట్టుగా మారింది. ఏనాడో మూడు, నాలుగేళ్ళ క్రితం వాడుకున్న కరెంటుకు కూడా ఇప్పుడు సర్‌ఛార్జ్ వసూలు చేస్తున్నారు. అంతేకాదు.. ఏటేటా టారిఫ్ పెంచుతూ.. వినియోగదారుల నడ్డి విరుస్తున్నారు.

ప్రస్తుతం నెలకు 150 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వారు.. టెలిస్కోపిక్ విధానంలో మొదటి యాభై యూనిట్లకు 130 రూపాయలు, ఆ తర్వాత యాభై యూనిట్లకు 162 రూపాయల యాభై పైసలు.. ఆ  తర్వాత మరో యాభై యూనిట్లకు 244 రూపాయలు.. వెరసి మొత్తం రూ. 536 బిల్లు చెల్లించాల్సి వస్తోంది. అయితే తమ ప్రభుత్వం ఏర్పడితే ఇదే విద్యుత్‌కు కేవలం 100 రూపాయల బిల్లు మాత్రమే వసూలు చేస్తామని వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హామీ ఇస్తున్నారు. ఇదే జరిగితే కొన్ని కోట్ల మంది పేదలకు నెలకు 436 రూపాయలు మిగులుతాయి.