ప్రాంతీయమే చక్రం తిప్పేది

23 Mar, 2014 23:19 IST|Sakshi
ప్రాంతీయమే చక్రం తిప్పేది

వీటి సారథ్యంలో సంకీర్ణ సర్కారుకూ అవకాశం

200 పైచిలుకు స్థానాలు గెల్చుకునే ఛాన్స్
లాభించనున్న సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్
కీలకం కానున్న తృణమూల్ కాంగ్రెస్, అన్నా డీఎంకే, వైఎస్సార్‌సీపీ
ఒడిశాలో ఎదురులేని బీజేడీ.. నవీన్ పట్నాయక్ వైపే ప్రజల మొగ్గు
మొత్తమ్మీద బీజేపీ 200లోపు, కాంగ్రెస్‌కు 100 సీట్లకు అటూఇటుగా రావొచ్చంటున్న సర్వేలు


 దేశవ్యాప్తంగా ‘ప్రాంతీయ’ ప్రాభవం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఈసారి ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పనున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన పలు సర్వేల అంచనాల ప్రకారం ఎన్డీఏకు సారథ్యం వహిస్తున్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో గరిష్టంగా రెండు వందల స్థానాలకు మించి లభించే అవకాశాల్లేవు. పదేళ్లుగా యూపీఏ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌కు వందకు అటూ ఇటుగా మాత్రమే సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి.

ప్రాంతీయ పార్టీలన్నింటి ఉమ్మడి స్కోరు 200 దాటడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ గద్దెపై ఎవరిని కూర్చోబెట్టాలో నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలే. బీజేపీ విషయంలో సర్వేల అంచనాలు తారుమారైతే, కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా ఆశ్చర్యమేమీ ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ స్థానాలను దక్కించుకున్న ప్రాంతీయ పార్టీలు కీలకంగా పరిణమించే అవకాశాలు ఉంటాయి. తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీ.. ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినాయకురాలు జయలలిత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వంటి నేతలు కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మమత, నవీన్, జయలలిత ఇప్పటికే తమ తమ రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో పాటు, ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు వారికి పూర్తి సానుకూలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు ప్రజాదరణ పుష్కలంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, మహారాష్ట్రలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కొంత బలహీనపడ్డా, పూర్తిగా ఉనికిలో లేకుండా పోయే పరిస్థితులు లేవు. ఈ తరుణంలో ప్రాంతీయ పార్టీల

 బలాబలాలు, ఎన్నికల తర్వాత వాటి ముందుండే అవకాశాలపై ఫోకస్...

 వైఎస్సార్‌సీపీ హవా

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీవూంధ్ర ప్రాంతంలోనే 20 స్థానాలకు అటూ ఇటుగా ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని ఎన్నికల సర్వేలన్నీ చెబుతున్నారుు. ఎన్నికల తర్వాత వుూడో ఫ్రంట్‌కే వుద్దతిస్తావుని పార్టీ ఇదివరకే ప్రకటించింది. మోడీ సవుర్థ పాలకుడని ప్రశంసించినా, ఎన్డీఏకు వుద్దతిస్తావుని పార్టీ నాయుకత్వం ఇంతవరకు ప్రకటించలేదు.



 జయకు జై...

 ప్రధాని పదవిపై ఆశలున్నాయుని చెబుతున్న వురో ప్రాంతీయు పార్టీ నేత తమిళనాడు వుుఖ్యవుంత్రి జయులలిత. ఆమె నాయుకత్వం లోని అన్నాడీఎంకేకు తమిళనాడు, పుదుచ్చేరిల్లోని మొత్తం 40 (39+1) సీట్లలో అత్యధికంగా 20-25 మధ్య రావచ్చని అంచనా. మొదట రెండు కవుూ్యనిస్టు పార్టీలతో పొత్తుకు ప్రయుత్నించి విఫలమైన అన్నాడీఎంకే చివరికి ఈ ఎన్నికల్లో కూడా జాతీయు పార్టీలతో పొత్తు లేకుండానే పోటీకి సిద్ధమైంది. 1998లో రెండో ఎన్డీఏ సర్కారుకు వుద్దతు ఉపసంహరించుకున్నాక అన్నాడీఎంకే వుళ్లీ ఇంతవరకు కేంద్రం లో అధికారం పంచుకోలేదు.


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో ఉన్న సత్సంబంధాల కారణంగా అవసరమైతే జయు ఎన్డీఏకు వుద్దతు ఇచ్చి అధికారంలో వాటా తీసుకునే అవకాశాలున్నారుు. కాంగ్రెస్, వావుపక్షాలతో గతంలో ఉన్న సంబంధాలు వురోసారి వుూడో ఫ్రంట్‌లో చేరడానికి దారితీయొచ్చు. తమిళనాట ప్రధాన ప్రతిపక్షం డీఎంకే బలహీనపడడం, రెండు ప్రధాన జాతీయు పార్టీలకు ఇక్కడ పొత్తులు లేకపోవడం అన్నాడీఎంకే బలం 20 సీట్లు దాటడానికి అవకాశమిస్తున్నారుు.
 

 చాంపియన్... టీఎంసీ

 16వ లోక్‌సభలో అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా తృణవుూల్ కాంగ్రెస్ అవతరించేలా కన్పిస్తోంది. ఈ పార్టీకి దాదాపు 30 సీట్లు దాటొచ్చని సర్వేలు చెబుతున్నారుు. పశ్చివు బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ తన ప్రధాన ప్రత్యర్థి సీపీఎం భాగస్వామిగా ఉన్న వుూడో కూటమిలో చేరే అవకాశం లేదు. అలాగే తప్పనిసరైతే తప్ప కాంగ్రెస్ నేతృత్వంలోని యుూపీఏలో వుళ్లీ చేరకపోవచ్చు. తన వుద్దతు కీలకమైన పక్షంలో ఎన్డీఏతో చేతులు కలపడానికి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి అభ్యంతరం ఉండకపోవచ్చు. తానూ ప్రధాని పదవి రేసులో ఉన్నానంటూ పార్టీ శ్రేణులు చేస్తున్న ప్రచారాన్ని ఆమె ప్రోత్సహిస్తున్నా, అది కేవలం సొంత రాష్ట్రంలో బలం పెంచుకోవడానికే. తనకు ఆ అవకాశం అంత తేలికగా రాదనే వాస్తవం మమతకూ తెలుసు. ఎన్డీఏకు తగినన్ని సీట్లు రాకపోతే కాంగ్రెస్, వావుపక్షాలు కీలకపాత్ర పోషించే తృతీయు ఫ్రంట్‌లో టీఎంసీ చేరికకు వీలు లేదనే చెప్పాలి. అసోం, త్రిపురల్లో కూడా పోటీ చేస్తున్నా, ఈ పార్టీకి వచ్చే సీట్లన్నీ బెంగాల్ నుంచేనని చెప్పవచ్చు.
 

 ఎస్పీ కుదేలే


 ఉత్తరప్రదేశ్‌లో అధికార పక్షమైన సవూజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 2009 ఎన్నికల్లో 23 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. ఈసారి అది 13కు పరిమితం కావచ్చని సర్వేలన్నీ చెబుతున్నారుు. కొడుకు అఖిలేశ్ పాలనలో ప్రజాదరణ కోల్పోరుున పార్టీ వురింత బలహీనపడకుండా ఆపడానికి ఎస్పీ అధినేత వుులాయుంసింగ్ యూదవ్ చేస్తున్న ప్రయుత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. యుూపీఏకు అవసరమైన పక్షంలో గతంలో లాగే బయుటి నుంచి వుద్దతివ్వడానికి ఎస్పీ వుుందుకు రావచ్చు. ఒకవేళ కాంగ్రెస్ బలం తగ్గి, వుూడో ఫ్రంట్ సర్కారు ఏర్పాటుకు అవకాశ మొస్తే వుులాయుం సహజంగానే ఆ ప్రయుత్నాలకు వుద్దతిస్తారు.

 జేడీ(యుూ)కు కష్ట కాలమే

 బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీ(యుూ), మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్డీఏ నుంచి వైదొలిగింది. అలా బీజేపీతో పదిహేనేళ్ల పొత్తును తెంచుకుంది. మోడీ ప్రభంజనం నిజంగా పనిచేస్తే బీహార్‌లో జేడీ(యుూ) గెలిచే లోక్‌సభ సీట్ల సంఖ్య ఐదుకు పడిపోవచ్చు. 2009లో ఆ పార్టీకి 20 సీట్లు రావడానికి బీజేపీతో పొత్తు ఉపకరించింది. ఈసారి రెండు ప్రధాన జాతీయు పార్టీలతో పొత్తు లేకుండా జేడీ(యూ) వుూడో ఫ్రంట్‌లో చేరింది. కవుూ్యనిస్టు పార్టీలతో ఉన్న సీట్ల సర్దుబాటు వల్ల దానికి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎన్నికల తర్వాత ఎన్డీఏ బలం ఊహించిన విధంగా పెరగకపోతే జేడీ(యుూ) నేత, బీహార్ సీఎం నితీశ్ యుూపీఏకు వుద్దతు ఇవ్వవచ్చు. సర్వేలను బట్టి చూస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో బలం బాగా తగ్గే అవకాశవుున్న పార్టీగా జేడీ(యుూ)ను భావించవచ్చు.

బలం తగ్గనున్న బీఎస్పీ

 రెండేళ్ల క్రితం యుూపీలో అధికారం కోల్పోరుున బహుజన్ సవూజ్ పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకునే అవకాశాలు లేవనే సర్వేలన్నీ చెబుతున్నారుు. అంతేగాక మోడీ ప్రభంజనం ఫలితంగా ఎస్పీతో పాటు బీఎస్పీ బలం కూడా తగ్గిపోతుందం టున్నాయి. గరిష్టంగా 15-18 లోక్‌సభ సీట్లు దక్కవచ్చని అంచనా వేస్తున్నారుు. బీఎస్పీకి ప్రస్తుతం 21 స్థానాలున్నాయి. మరీ అవసరమైతే తప్ప బీఎస్పీ అధినేత్రి వూయూవతి ఎన్డీఏకు వుద్దతివ్వక పోవచ్చు. ఎస్పీ భాగస్వామిగా ఉండే వుూడో ఫ్రంట్ సర్కారు ఏర్పాటు చేసేందుకు కూడా ఆమె సాయుపడే అవకాశం లేదు.
 

 టీఆర్‌ఎస్ జోరు!


 ప్రత్యేక తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన టీఆర్‌ఎస్‌కు ఈసారి 10-12 లోక్‌సభ సీట్ల దాకా రావచ్చని సర్వేల అంచనా. యుూపీఏతో పాత సంబంధాలున్న ఈ పార్టీ ఎన్నికల తర్వాత అవసరమైతే దానికి వుద్దతిస్తానని చెబుతోంది. ఇప్పటికి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోలేదు. ఎన్నికల తర్వాత బీజేపీ నాయుకత్వంలోని ఎన్డీఏకు కేసీఆర్ వుద్దతు ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. అలాగాక కాంగ్రెస్ బలం బాగా తగ్గి, ఎన్డీఏ పుంజు కోకపోతే వుూడో ఫ్రంట్‌కు వుద్దతిచ్చే అవకాశవుుంది.

 బీజేడీకి ఏకపక్షం!

 ఒడిశాలో 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌కు ఈసారి 17 సీట్లు రావచ్చని సర్వేలు చెబుతున్నారుు. కాంగ్రెస్, బీజేపీలు ఏవూత్రం పుంజుకోకపోవడమే బీజేడీ నిలదొక్కు కోవడానికి కారణవుని చెప్పొచ్చు. ఈ ఐదేళ్లలో ఎందరో పెద్ద నేతలు బీజేడీ నుంచి వైదొలిగినా వుుఖ్యవుంత్రి నవీన్ పట్నాయుక్ పాలన, ప్రజలకు వురో ప్రత్యావ్నూయుం లేకపోవడం కారణంగా ఈ ఎన్నికల్లో బీజేడీ స్కోరు 15కు తగ్గకపోవచ్చు. ఒడిశా రాజకీయూల దృష్ట్యా కేంద్రంలో కాంగ్రెస్‌తో బీజేడీ చేతులు కలిపే చాన్సే లేదు. ఈ పార్టీ ప్రస్తుతం ఏ కూటమిలోనూ లేకున్నా ఎన్నికల తర్వాత వీలును బట్టి ఎన్డీఏలోనో, వుూడో ఫ్రంట్‌లోనో చేరవచ్చు. ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే ఒడిశాలో కూడా లోక్‌సభతో పాటు అసెంబ్లీకీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ బరిలో కాంగ్రెస్, బీజేడీలే ప్రధాన

తెలుగుదేశం

 
15వ లోక్‌సభలో ఆరుగురు సభ్యులున్న తెలుగు దేశం బలం ఈసారి కూడా అటూఇటుగా అంతే ఉండొచ్చని సర్వేలంటున్నారుు. బీజేపీతో టీడీపీకి పొత్తుంటుందని కొద్ది నెలలుగా ఊహాగానాలు సాగుతున్నారుు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఎన్డీఏలో చేరే అవకాశాలే కనిపి స్తున్నారుు.
 

సంక్షోభంలో డీఎంకే

 గతంలో ఎన్డీఏ, యుూపీఏ-1,2 సర్కార్లలో భాగస్వామిగా ఉన్న ఈ తమిళనాడు ప్రాంతీయుపార్టీ ఇప్పుడు రెండు ప్రధాన జాతీయు పార్టీలతోనూ పొత్తు లేకుండా పోటీ చేస్తోంది. వుూడేళ్ల క్రితం అధికారం కోల్పోయూక ఎన్నడూ లేనన్ని కష్టాల్లో వుునిగి ఉంది. ప్రస్తుత సర్వేల ప్రకారం డీఎంకేకు లోక్‌సభ ఎన్నికల్లో 10 సీట్లు మించి రాకపోవచ్చు. డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఈ వుధ్యనే మోడీకి సానుకూలంగా వూట్లాడారు. ఒకవేళ అన్నాడీఎంకే వుద్దతు ఎన్డీఏకు లభించకపోతే డీఎంకేకు ఆ అవకాశం రావచ్చు. వుూడో ఫ్రంట్ పార్టీలతో పాత సంబంధాల కారణంగా ఆ ఫ్రంట్‌లోనూ చేరే వీలుంది. మొత్తమ్మీద గడ్డుస్థితిలో ఉన్న ఈ పార్టీకి కేంద్రంలో అధికారం పంచుకునే అవకాశం తక్కువే. 2జీ స్పెక్ట్రం కుంభకోణం డీఎంకేను బాగా దెబ్బ తీసింది.

 ఆటలో అరటిపండు జేడీ(ఎస్)...

 ఇటీవల వుూడో ఫ్రంట్‌లో చేరిన ప్రాంతీయుపార్టీల్లో చిన్న పార్టీ వూజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వం లోని జేడీ(ఎస్). 2009లో 3 సీట్లు గెలుచుకున్న ఈ పార్టీ ఈసారి 2కే పరిమితవతుందని అంచనా. కర్ణాటకలో బీజేపీతో ఉన్న అనుభవాల కారణంగా ఎన్డీఏతో చేతులు కలిపే అవకాశాల్లేవు. వుూడో కూటమితో కలిసి పని చేయుడం మినహా వురో ప్రత్యావ్నూయుం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండానే బరిలో దిగుతోంది.

ఎన్సీపీకి ఎదురు గాలి

 13 ఏళ్లుగా వుహారాష్ట్రలో కాంగ్రెస్‌తో అధికారం పంచుకుంటూ పదేళ్లుగా కేంద్రంలో యుూపీఏ భాగస్వామిగా కొనసాగుతున్న ప్రాంతీయు పార్టీ ఎన్సీపీ. శరద్‌పవార్ నేతృత్వంలోని ఈ పార్టీ 2009లో 8 లోక్‌సభ సీట్లు గెలిచింది. ఈసారి 5కే పరిమితవతుందని అంచనా. ఈ ఎన్నికల్లో యుూపీఏ బలం బాగా తగ్గినా ఎన్డీఏ పక్షాన చేరే అవకాశాలు తక్కువే. పవార్ ఈ వుధ్య బీజేపీకి, మోడీకి అనుకూలంగా వూట్లా డినా వుహారాష్ట్ర రాజకీయూల కారణంగా ఆ పార్టీతో చేతులు కలిపే పరిస్థితి రాకపో

ఆర్జేడీ... అంతంతే

 యుూపీఏ-1 సర్కారులో భాగస్వామిగా ఉండి, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దూరమైన పార్టీ ఆర్జేడీ. ఫలితంగా అప్పుడు దీనికి 4 సీట్లే వచ్చారుు. దాణా స్కాంలో దోషిగా తేలడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు కుదిరినా ఆర్జేడీ బలం 4 నుంచి పెద్దగా పెరిగే అవకాశాల్లేవని సర్వేలు చెబుతున్నారుు. ఎల్జేపీ ఈసారి బీజేపీతో చేతులు కలపడంతో లాలూ పరిస్థితి బలహీనపడింది. ఆయనపై కోర్టు కేసులు, బీహార్ రాజకీయూల కారణంగా ఆర్జేడీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పక్షానే ఉంటుంది.

 ‘చిక్కి’పోనున్న వావుపక్షాలు

 సీపీఐ, సీపీఎం నేతృత్వంలోని వామపక్షాల బలం 2009 లోక్ సభ ఎన్నికల్లో గణనీయుంగా పడిపోరుుంది. పశ్చివు బెంగాల్ లో ప్రధాన ప్రత్యర్థి తృణవుూల్ కాంగ్రెస్ బలం వురింత పెరిగి, కేరళలోనూ తగినంతగా పుంజుకోక పోతే ఈసారి వావుపక్షాలు వురింత బలహీన పడవచ్చు. అదే జరగవచ్చని ఎన్నికల సర్వేల న్నీ చెబుతున్నారుు. లోక్‌సభలో వామపక్ష కూటమి బలం ప్రస్తుతమున్న 24 స్థానాల నుంచి బాగా తగ్గిపోయేలా ఉంది. బీజేపీ పెద్దగా పుంజుకోకుండా, యుూపీఏకు తవు వుద్దతు అవసరమైన పక్షంలో వావుపక్షాలు అందుకు సిద్ధపడవచ్చు. కుదిరితే తృతీయు ఫ్రంట్ సర్కారు ఏర్పాటుకు సాయుపడవచ్చు.

 

మరిన్ని వార్తలు