అమ్మ మాట..

17 Apr, 2014 01:22 IST|Sakshi
అమ్మ మాట..

కడుపుకోతే మిగిలింది
 పట్నంల పనిచేసేటప్పుడు ఎప్పుడు ఫోన్‌జేసినా తెలంగాణ మీటింగ్‌లో ఉన్నా అనేటోడు నా బిడ్డ. తెలంగాణ వస్తెనే మనసొంటి పేదోళ్ల బతుకులు మారుతయనెటోడు.ఆ తెలంగాణ కోసమే ఢిల్లీకిబోయి పానందీస్కుండు. యాదిరెడ్డికి ఆరేళ్లున్నప్పుడే నా భర్త నర్సింహారెడ్డి కన్నుమూసిండు. అప్పుడు నాకు యాదిరెడ్డి, మంగమ్మ, ఓంరెడ్డి ముగ్గురు పిల్లలు. అన్ని కష్టాలకోర్చి యాదిరెడ్డిని 8వ తరగతి, ఓంరెడ్డిని 5వ తరగతి దాకా సదివించిన. యాదిరెడ్డి సదువు మానేసి చిన్న పనులు జేసిండు. ఊర్లనే దొరికిన పన్జేసుకుంట డ్రైవింగ్ నేర్చుకున్నడు. కొన్ని రోజులైనంక పట్నంబో యి డ్రైవింగ్ పనిచేసుకుంట అక్కడే ఉంటుండె.    
 
 ఎప్పుడూ తెలంగాణ కోసమే మాట్లాడుతుంటే నేను ఎక్కువ పట్టించుకోలే. కానీ ఢిల్లీకి బోయి ఉరేసుకుని సచ్చిపోతే అప్పుడు తెల్సింది ఆడికి తెలంగాణ అంటే ఎంతిష్టమో. యాదిరెడ్డి సచ్చిపోయినప్పుడు మా ఇంటికి వేయిల మంది వచ్చిండ్రు. గిప్పుడు తెలంగాణ వచ్చిందనే సంతోషం ఉన్నా.. నాకైతే కడుపుకోతే మిగిలింది. ఎవరు ఎన్ని చెప్పినా నా కొడుకు తిరిగొస్తడా? ఆడి ఆత్మకు శాంతి కలగాలె. చెట్టంత కొడుకు పానం పోయినా సర్కారైతే ఏం సాయం సెయ్యలే.
 - కోసిక శ్రీనివాస్,  మొయినాబాద్

మరిన్ని వార్తలు