పట్టుబడిన ‘పచ్చ’ మద్యం

6 May, 2014 03:34 IST|Sakshi
పట్టుబడిన ‘పచ్చ’ మద్యం

జిల్లా వ్యాప్తంగా 5,485 మద్యం సీసాలు స్వాధీనం
పొదలకూరు, న్యూస్‌లైన్ : పోలింగ్ సమయం ముంచుకొస్తుండటంతో గెలుపే లక్ష్యంగా పచ్చ పార్టీ ప్రలోభాలకు తెగబడుతోంది. పంపిణీ చేసేందుకు తరలిసు ్తన్న, దాచి ఉంచిన భారీ స్థా యిలో మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జి ల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో 5, 485 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. పొదలకూరు పట్టణంలో వేర్వేరు ప్రాంతాల్లో అక్రంగా మద్యం నిల్వలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

 దీంతో సీఐ ఎం.హైమారావు, ఎస్సై ఎం.అంజిరెడ్డి తమ సిబ్బందితో ఓ పాడుబడిన ఇంట్లో ఉన్న 1700 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ బస్టాండ్‌కు సమీపంలోని కామాక్షి వైన్స్ మిద్దెపైన ఓ గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన 800 మద్యం సీసాలను పట్టుకున్నారు. అయితే పోలీసులు స్వా ధీనం చేసుకున్న మద్యం సీసాలు టీడీపీకి చెందినవిగా ప్రచారం జరుగుతోంది.  

 ఇస్కపాళెంలో 1,884 బాటిళ్లు..: వెంకటాచలం : ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెటేందుకు టీడీపీ నాయకులు తరలిస్తున్న 1,884 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఫ్లయింగ్ స్కాడ్ అధికారి శివకుమార్ ఇస్కపాళెం గ్రామ శివారులో తనిఖీలు నిర్వహించారు. మద్యం షాపు నుంచి ఆటోలో అక్రమంగా ఏడు బస్తాల్లో తరలిస్తున్న 1,884  బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఆటో డైవర్ తురక హరిని అదుపులోకి తీసుకున్నారు. తాటిపర్తిపాళెం, ఎగువమిట్ట, పూడిపర్తి గ్రామాలకు తరలించేందుకు ప్రయత్నించగా సమాచారంతో అధికారులు నిఘా పెట్టి పట్టుకున్నారు.

 866 మద్యం బాటిళ్లు..: ఓజిలి : మండలంలో వివిధ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి 866 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో టీడీపీ నేత ఇంట్లో 526 సీసాలు పట్టుబడ్డాయి. ఇనుగుంట పంచాయతీ వజ్జవారిపాళెంకు చెందిన టీడీపీ నేత వర్మారెడ్డి నివాసంలో మద్యం అక్రమ నిల్వ ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ నిర్వహించారు.

ఇంట్లో 526 మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి ఫ్లయింగ్ స్క్వాడ్ కాంతారావు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక జాతీయ రహదారి రాజుపాళెం క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై జేపీ శ్రీనివాసులురెడ్డి తనిఖీలు నిర్వహిస్తుండ గా, ఇద్దరు వ్యక్తులు బైక్‌పై రెండు గోతాల్లో మద్యం సీసాలను తరలిస్తున్నారు. బైక్‌పై వెళుతున్న వ్యక్తి పోలీసులను చూసి బైక్ వేగంను పెం చాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి బైక్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కొద్ది దూరం వెళ్లే సరికి బైక్‌పై ఉన్న రెండు బస్తాలను  పొలాల్లో పడేసి వెళ్లారు. బస్తాలను పరిశీలించి అందులోని 340 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
   
 పొలాల్లో 424 మద్యం సీసాలు.. : ముత్తుకూరు : ముత్తుకూరు సమీపంలోని చలివేంద్ర రోడ్డులోని పొలాల్లో దాచి ఉంచిన 424 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పొలాల్లోని ఓ గదిలో దాచిన మద్యం సీసాల బస్తాను ఓ వ్యక్తి సైకిల్‌పై తీసుకువెళుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బయపడిన అతను మద్యం సీసాల బస్తాను అక్కడే పడేసి వెళ్లిపోయాడు. పోలీసులు వచ్చి గదికి వేసిన తాళం పగులగొట్టి లెక్కించగా 424 మద్యం సీసాలు ఉన్నట్టు గుర్తించారు.

 మరో 811 మద్యం బాటిళ్లు.. : జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో మల్లమ్మగుడి వీధిలో 426 మద్యం బాటిళ్లను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, కాలేజీ మిట్టలో మరో 95 మద్యంబాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుత్తలూరు మండలంలో దుత్తలూరు, నర్రవాడ, చింతలగుంట ప్రాంతాల్లో 220 మద్యం బాటిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయగిరి నుంచి వివిధ గ్రామాలకు తరలిస్తున్న 70 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఏజెంట్లుగా మారిన ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు  
వాకాడు న్యూస్‌లైన్ :  మండలంలో పనిచేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. పని దినాలు తక్కువ కావడంతో కొంత మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఇటీవల విధుల నుంచి తొలగించారు. వీరికి చింతామోహన్ ఎరవేసి తాను అండగా ఉండి మళ్లీ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని చింతామోహన్ ఇటీవల దుగరాజపట్నంలో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి హామీ ఇచ్చినట్లు సమాచారం.

అంతేకాకుండా విధుల్లో ఉన్నవారిని కూడా పర్మినెంట్ చేయిస్తామని వారికి ఆశ కల్పించడంతో వారు కూడా కాంగ్రెస్ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. వీరే పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా నిలవనున్నారని సమాచారం. డబ్బు, మద్యం పంపకాలు కూడా వీరి చేతికే కాంగ్రెస్ నాయుకులు పగ్గాలు పట్టించినట్లు పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు