ఆమెకు ఎదురులేదు!

19 May, 2014 00:07 IST|Sakshi
ఆమెకు ఎదురులేదు!

 కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని విషయాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఈ పనులు పురుషులు మాత్రమే చేయగలరనే భావనను చెరిపేస్తూ.. అవకాశమిస్తే తాము దూసుకుపోతామని నిరూపిస్తున్నారు. అవనిలోనే కాదు.. అంతరిక్షంలోనూ ‘ఆమె’ ఎదురులేదని నిరూపిస్తోంది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో రాజకీయాల్లోనూ వీరి ప్రాతినిధ్యం పెరుగుతోంది.

ఇటీవల ముగిసిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో వీరి సంఖ్య అమాంతం పెరిగిపోవడమే అందుకు నిదర్శనం. 2006కు ముందు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉండటంతో జిల్లాలోని 53 జెడ్పీటీసీ స్థానాల్లో 17 స్థానాలను మహిళలు కైవసం చేసుకున్నారు. అప్పటి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు.. బీసీలు ఏడుగురు.. అన్ రిజర్వు కింద ఏడుగురు మహిళలు ఎన్నికయ్యారు.

ప్రస్తుతం రిజర్వేషన్ 50 శాతానికి చేరుకున్న నేపథ్యంలో 27 మంది మహిళలు జెడ్పీటీసీ స్థానాల్లో పాగా వేశారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలు 1, ఎస్సీలు 5, బీసీలు 11, అన్ రిజర్వు కింద 10 స్థానాలను మహిళలకే కేటాయించారు. గత నెల 6, 11 తేదీల్లో నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల్లో ఈ స్థానాల్లో మహిళలు విజయఢంకా మోగించారు. వీరిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధికంగా 14 మంది మహిళలు.. టీడీపీ తరఫున 11, కాంగ్రెస్ తరఫున 1, ఆర్‌పీసీ తరఫున ఒకరు జెడ్పీ పాలనలో భాగస్వాములు కానుండటం విశేషం.
 
 టీడీపీ మహిళా జెడ్పీటీసీలు
 వి.సరస్వతి(కల్లూరు), ఎం.లక్ష్మిదేవి(క్రిష్ణగిరి), పి.జగదీశ్వరమ్మ(గోస్పాడు), నారాయణమ్మ(పాణ్యం), వెంకటలక్ష్మమ్మ(రుద్రవరం), పి.సుశీలమ్మ(ఆస్పరి), సరస్వతి(దేవనకొండ), లక్ష్మి(కౌతాళం), పుష్పావతి(నందవరం), ఈ.సుకన్య (పత్తికొండ), కె.వరలక్ష్మి(తుగ్గలి). కాంగ్రెస్, ఆర్‌పీఎస్ మహిళా జెడ్పీటీసీలు జి.శారదమ్మ(కోడుమూరు), రాధమ్మ(పగిడ్యాల).
 
 వైఎస్సార్‌సీపీ మహిళా జెడ్పీటీసీలు
 ఎం.పద్మావతమ్మ(బేతంచెర్ల), బి.కె.నాగజ్యోతి(గూడూరు), ఎం.కె.మాధవి(కర్నూలు), చింతకుంట లక్ష్మి(నందికొట్కూరు), బి.అశ్వర్థమ్మ(బండిఆత్మకూరు), టి.నాగమ్మ(చాగలమర్రి), వై.సరస్వతి(కొలిమిగుండ్ల), ఎం.లక్ష్మిదేవి(నంద్యాల), గోపిరెడ్డి సుభద్రమ్మ(ఉయ్యాలవాడ), రాములమ్మ(గోనెగండ్ల), కె.గంగమ్మ (హొళగుంద), దళవాయి మంగమ్మ(కోసిగి), రేణుకాదేవి(పెద్దకడుబూరు), జయమ్మ(ఎమ్మిగనూరు).

మరిన్ని వార్తలు