బాహుబలి 2 రికార్డును.. బ్రేక్‌ చేసింది

11 Oct, 2017 19:35 IST|Sakshi

సాక్షి,ముంబయి: సంజయ్‌ లీలా భన్సాలీ చెక్కిన వెండితెర దృశ్య కావ్యం పద్మావతి అరుదైన ఫీట్‌ సాధించింది. ఇటీవల విడుదలైన పద్మావతి చిత్ర ట్రయలర్‌ బయటకు వచ్చిన 24 గంటల్లోనే ఒక కోటి 50 లక్షల మందికి పైగా వీక్షకులు వీక్షించారు. విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన బాహుబలి 2 ట్రయలర్‌ కోటి 11 లక్షల మంది వీక్షించారు. భారత చలనచిత్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి 2 ట్రయలర్‌ వీక్షకుల రికార్డును కేవలం 24 గంటల్లో బ్రేక్‌ చేసిన పద్మావతి ఇక విడుదలైన తర్వాత మరెన్ని సంచలనాలు క్రియేట్‌ చేస్తుందోననే అంచనాలు నెలకొన్నాయి. చారిత్రక చిత్రంగా విపరీతమైన హైప్‌ ‍క్రియేట్‌ అయిన పద్మావతి ట్రయలర్‌కు వీక్షకుల నుంచి అపూర్వ స్పందన వస్తుండటంతో చిత్ర మేకర్లు సంతోషంగా ఉన్నారు.

ట్రయలర్‌ను చూసిన పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, విమర్శకులు దర్శకుడు సంజయ్‌ భన్సాలీపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. పద్మావతిగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికా పడుకోన్‌ తన అందాలతో ఆకట్టుకోనుండగా, మహర్వాల్‌ రతన్‌ సింగ్‌గా షాహిద్‌ కపూర్‌, అల్లావుద్దీన్‌ ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తున్నారు. 

Read latest Entertainment News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు