తమ్ముడూ.. నువ్వంటే పిచ్చి..

12 Oct, 2017 03:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా యువ కెరటం.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా 24వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా పాండ్యాకు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుత క్రికెటర్లు నుంచి మాజీ క్రికెటర్ల వరకు.. అటు అభిమానుల నుంచి బాలీవుడ్‌ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంలో పోటీపడ్డారు. అంతే ఓపికగా అందరికి పాండ్యా ధన్యవాదాలు తెలిపాడు. ఇక హార్దిక్‌ పాండ్యా అన్న కృనాల్‌ పాండ్యా మాత్రం ‘తమ్ముడూ నువ్వంటే నాకు పిచ్చి..’ అని వరుస ట్వీట్‌లతో తమ్ముడిపై ఉన్న ప్రేమను తెలియజేశాడు. 

‘తమ్ముడూ.. నీకో విషయం తెలుసా! నువ్వంటే నాకు పిచ్చి. కొన్ని సార్లు కోపంతో నీ మీద అరిచాను. కానీ నిజం ఏంటంటే నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వే నాకు స్ఫూర్తి, బలం. నువ్వు అందుకుంటున్న విజయాల పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇది నీకు, మనకు ప్రారంభం మాత్రమే అని నాకు తెలుసు. ఈ సందర్భంగా నీకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా. నీ కోసం ఎల్లప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను. ఐ లవ్యూ సో మచ్‌. హ్యాపీ బర్త్‌డే మై బ్రో. దేవుని దీవెనలు నీకు ఉంటాయి. నువ్వెప్పుడూ మెరవాలి’ అని కృనాల్‌ పేర్కొన్నాడు. దీనికి హార్దిక్‌ ‘నాకు తెలుసన్నా.. నాది కూడా సేమ్‌ ఫీలింగ్‌’  అంటూ రిప్లే ఇచ్చాడు. ఇక ఈ అన్నదమ్ములు ఐపీఎల్‌-10లో ముంబై ఇండియన్స్‌ జట్టు టైటిల్‌ గెలువడంలో కీలక పాత్ర పోషించిన విషయం అందరికి తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు