వయసు పెరుగుతుంటే... ఎముకల పటుత్వం తగ్గుతుంది

26 May, 2014 23:16 IST|Sakshi
వయసు పెరుగుతుంటే... ఎముకల పటుత్వం తగ్గుతుంది

నిర్ధారణ

వయసు పెరిగే కొద్దీ ఎముకల పటుత్వం లోపించడంతో వార్ధక్య చిహ్నాలు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల రూపంలో బయటపడుతుంటాయి. ఆస్టియోపోరోసిస్‌ను నిర్ధారణ చేయాలంటే...  మెడికల్ హిస్టరీ... గతంలో జరిగిన ప్రమాదాలు రక్తసంబంధీకుల ఎముకల సమస్యలు, ఆహారవిహారాల వివరాలు.
 
 ఫిజికల్ ఎగ్జామినేషన్  బోన్ డెన్సిటీ టెస్ట్ ఫాక్స్ (ఫ్రాక్చర్ రిస్క్ అసెస్‌మెంట్ టూల్)  లాబొరేటరీ టెస్ట్‌ల్లో భాగంగా  రక్తం, మూత్ర పరీక్షల ద్వారా ఎముక పటుత్వం తగ్గడానికి కారణాలను తెలుసుకుంటారు. ఇందులో రక్తంలో క్యాల్షియం స్థాయులు, 24 గంటల పాటు విసర్జించిన మూత్రంలో క్యాల్షియం మోతాదును పరీక్షించడం, థైరాయిడ్ పనితీరు, పారాథైరాయిడ్ హార్మోన్ స్థాయులు, టెస్టోస్టీరాన్ స్థాయులు (మగవారిలో),  హైడ్రాక్సి విటమిన్ -డి పరీక్ష, బయోకెమికల్ మార్కర్ టెస్ట్‌లు ఉంటాయి. అవసరమైతే న్యూక్లియర్ బోన్ స్కాన్, సి.టి. స్కాన్, ఎం.ఆర్.ఐ కూడా చేయాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు