యావరేజ్‌  ‘లైఫ్‌’ ఇష్టం

5 Jan, 2018 01:10 IST|Sakshi

శోభితా ధూళిపాళ్ల తెనాలి అమ్మాయి. 1992 బ్యాచ్‌. ఆ ఇయర్‌లో పుట్టింది. ఉండడం ముంబైలో. 2013లో ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ టైటిల్‌ తనదే. అనురాగ్‌ కాశ్యప్‌ మూవీ ‘రమణ్‌ రాఘవ్‌ 20.0’లో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ పక్కన హీరోయిన్‌ తనే. శోభిత ఫస్ట్‌ మూవీ అది. ఆ మూవీ కాన్స్‌ ఫెస్టివల్‌కు కూడా వెళ్లింది. ‘‘అరె! అక్కడ అంత రెస్పెక్ట్‌ ఇస్తారు కదా మంచి మంచి మూవీలకు, మరి అంత మంచి మూవీలు తీసికూడా, చూసి కూడా మనకు మనం రెస్పెక్ట్‌ ఎందుకు ఇచ్చుకోమో.. నాకు స్ట్రేంజ్‌గా ఉంటుంది’’ అని శోభిత ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. మన ఇండస్ట్రీలో శోభితకు నచ్చనిది ఇంకోటి కూడా ఉంది. బాలీవుడ్‌ సినిమాల్లో అమ్మాయిలు షార్ట్స్, ట్యాంక్‌ టాప్‌ వేసుకుని, కాళ్లకు స్నీకర్స్‌ తొడుక్కుని, హెయిర్‌ని బ్లో డ్రై చేయించుకుని కనిపించడం!

కనిపించడం అంటే.. ఈ దర్శకులు, నిర్మాతలు చూపించడం. మెట్రోపాలిటన్స్‌లో సింపుల్‌గా జీన్స్, షార్ట్‌ కుర్తా వేసుకుని కాలేజీలకు, ఉద్యోగాలకు పరుగులు తీస్తుండే యావరేజ్‌ అమ్మాయిల లైఫ్‌ స్టెయిల్‌ని ఒక ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌లా మనం చూపించలేమా అని శోభిత తరచూ వండర్‌ అవుతుంటుంది. హోమ్‌ మేకర్, గవర్నమెంట్‌ స్కూల్‌ టీచర్, ఒక టైలరు కూతురు.. ఇలాంటి పాత్రలు వేయడం ఆమెకు ఇష్టం. అయితే ఇచ్చేవారెవరు? శోభితను చూస్తే ఇవ్వాలనే అనిపిస్తుంది. (అంత ‘డౌన్‌ టు ఎర్త్‌’గా ఉంటుంది శోభిత) కానీ తీసేవాళ్లెవరు? జనవరి 12న ఆమె నటించిన బ్లాక్‌ కామెడీ బాలీవుడ్‌ మూవీ ‘కాలకాండీ’ విడుదల అవుతోంది. అందులో సైఫ్‌ అలీ ఖాన్‌ పక్కన శోభిత నటించింది. బహుశా అందులో ఆమె అభీష్టం నెరవేరే ఉంటుంది. ‘కాలకాండీ’ అంటే మరాఠీలో ఏదీ కోరుకున్నట్లు జరగకపోవడం. 

మరిన్ని వార్తలు