Anurag Kashyap says he wanted to quit filmmaking because of negativity - Sakshi
Sakshi News home page

Anurag Kashyap: రెండేళ్లు ఇబ్బందులు పడ్డా.. చాలా ఆఫర్లు వచ్చాయి.. కానీ: అనురాగ్

Published Sun, Aug 13 2023 6:42 PM

Anurag Kashyap says he wanted to quit filmmaking because of negativity - Sakshi

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన కెన్నెడీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నిలియోన్, రాహుల్ భట్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన బాలీవుడ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్‌ ఎదురైన పరిస్థితుల వల్ల ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

(ఇది చదవండి: ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే!)

అదే సమయంలో తనకు తమిళం, మలయాళం ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వచ్చాయని వెల్లడించారు. అందుకు గల కారణాలను కూడా అనురాగ్ వివరించారు. నెగెటివిటీ కారణంగా ఒకానొక సమయంలో బాలీవుడ్‌ వదిలి వెళ్లిపోవాలనుకున్నానని దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ అన్నారు. నెగెటివిటీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. 

అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. 'ఒకటి, రెండు సంవత్సరాల పాటు నాకు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నా.  2021కి ముందు రెండేళ్లపాటు ఎక్కువగా ప్రభావితమయ్యా. ఆ సమయంలో బయటకు వెళ్లాలని అనుకున్నా. దక్షిణాదికి చెందిన నా స్నేహితులు తమిళంలో సినిమాలు చేయమని ఆహ్వానించారు. కేరళకు చెందిన నా స్నేహితుడు మలయాళంలో సినిమాలు చేయమని పిలిచారు. జర్మన్, ఫ్రెంచ్ సినిమాలు చేయమని కూడా ఆహ్వానం అందింది. కానీ నాకు భాషలు తెలియక వాటిని అంగీకరించలేకపోయా. విమర్శలు అన్నింటినీ ఎదుర్కొన్నప్పటికీ.. ఈ రంగంలోనే కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉన్నా. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా విమర్శించినా నేను పెద్దగా పట్టించుకోను. అవీ నన్ను ఏమాత్రం బాధపెట్టడం లేదు. వాళ్లు ఏం మాట్లాడినా.. నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతా.' అని అన్నారు. 

(ఇది చదవండి: భార్య వల్లే హీరో ప్రశాంత్‌ కెరీర్‌ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో)

అనురాగ్ కెరీర్
అనురాగ్ కశ్యప్ మొదట  రామ్ గోపాల్ వర్మ చిత్రం సత్యలో కో- డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత బ్లాక్ ఫ్రైడే, నో స్మోకింగ్, దేవ్.డి, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, అగ్లీ, రామన్ రాఘవ్ 2.0 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన చివరిసారిగా మేడ్ ఇన్ హెవెన్ సీజన్ -2లో ప్రత్యేక పాత్రలో కనిపించారు.

Advertisement
Advertisement